Homeటాప్ స్టోరీస్సవ్యసాచి రివ్యూ

సవ్యసాచి రివ్యూ

savyasachi movie review
సవ్యసాచి రివ్యూ

సవ్యసాచి రివ్యూ :
నటీనటులు : అక్కినేని నాగచైతన్య , నిధి అగర్వాల్ , మాధవన్
సంగీతం : ఎం ఎం కీరవాణి
నిర్మాతలు : నవీన్ , మోహన్ , రవిశంకర్
దర్శకత్వం : చందు మొండేటి
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 2 నవంబర్ 2018

అక్కినేని నాగచైతన్య హీరోగా మాధవన్ కీలక పాత్రలో చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం సవ్యసాచి . ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్ళాల్సిందే .

- Advertisement -

కథ :

విక్రం ఆదిత్య ( అక్కినేని నాగచైతన్య ) కు వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉంటుంది . దాని వల్ల ఎడమ చేయి కి అనూహ్యమైన బలం వస్తుంది . విక్రం చైత్ర ని (నిధి అగర్వాల్ ) ప్రేమిస్తాడు . చైత్ర కూడా విక్రం ని ప్రేమిస్తుంది అయితే సడెన్ గా విక్రం ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోవడం , విక్రం మేనకోడలు ని ఎవరో కిడ్నాప్ చేయడం , బాంబ్ బ్లాస్ట్ లో బావ (భరత్ రెడ్డి ) చనిపోవడం అక్క ( భూమిక ) గాయాలతో హాస్పటల్ లో చేరుతుంది . సాఫీగా సాగిపోతున్నవిక్రం జీవితం అనూహ్య మలుపులు తిరగడానికి కారణం ఎవరు ? తనని చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరు ? చివరకు ఆ అపరిచితుడిని విక్రం ఆదిత్య అంతం చేసాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
ఎంటర్ టైన్ మెంట్
బ్యాగ్రౌండ్ స్కోర్
నాగచైతన్య
మాధవన్
వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కాన్సెప్ట్

డ్రా బ్యాక్స్ :

కాలేజ్ ఎపిసోడ్
రొమాంటిక్ ట్రాక్

నటీనటులు :

విక్రం , ఆదిత్య గా నాగచైతన్య నటన బాగుంది , ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో నటనలో మరింతగా ఎదిగాడు చైతూ . డ్యాన్స్ లో కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు . లెఫ్ట్ హ్యాండ్ స్కీం కూడా బాగానే వర్కౌట్ అయ్యింది . మాధవన్ కీలక పాత్రలో బాగా నటించాడు . సమాజం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న సైకో గా రాణించాడు . నిధి అగర్వాల్ స్క్రీన్ ప్రేజేన్స్ బాగుంది . అయితే ఈ భామకు నటించడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది . అయితే చాలా అందంగా కనిపించింది సినిమాలో . వెన్నెల కిషోర్ , సత్య , శకలక శంకర్ ల కామెడి బాగానే ప్రేక్షకులను అలరించింది . భూమిక పాత్రకు ప్రాధాన్యత తక్కువే ! ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు .

సాంకేతిక వర్గం :

వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధి ని బేసిక్ పాయింట్ చేసుకొని చందు మొండేటి మంచి నేపథ్యాన్నే తీసుకున్నాడు కానీ దాన్ని అంతే స్థాయిలో వాడుకోవడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు . అయితే సినిమాని మొదటి భాగం ప్రేమ తో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ ని అందించిన చందు ఇంటర్వెల్ సీన్ కి భలే ట్విస్ట్ ఇచ్చాడు . సెకండాఫ్ లో అక్కడక్కడా కొంత నెమ్మదించినప్పటికి కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సవ్యసాచి ని మరో లెవల్ లో నిలబెట్టింది . ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ దక్షత ఎలాంటిదో గ్రాండియర్ గా చూపించారు . విజువల్స్ బాగున్నాయి .

ఓవరాల్ గా :

ఫస్టాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ ని , అలాగే ఓ విభిన్నతని ఎంచుకోవాలని చూసేవాళ్ళకు సవ్యసాచి మంచి ఛాయిస్ .

English Title: savyasachi movie review

                               Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All