Homeటాప్ స్టోరీస్సవ్య సాచి ఆడటం కష్టమనుకున్నాడట

సవ్య సాచి ఆడటం కష్టమనుకున్నాడట

Nagachaitanyaచందు మొండేటి మొదట నాకు చెప్పిన కథ వింటే వెంటనే భయపడిపోవడం ఖాయం ఎందుకంటే అలా ఉంది మరి ఆ కథ దాంతో వెళ్ళిపోయిన చందు అన్ని కమర్షియల్ అంశాలను మేళవించి పక్కగా రూపొందించాడని దాంతో సంతోషంగా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని అంటున్నాడు అక్కినేని నాగచైతన్య . రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సవ్యసాచి విడుదల కానున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన చైతూ సవ్యసాచి విశేషాలను వెల్లడించాడు . లెఫ్ట్ హ్యాండ్ మరోలా ప్రయత్నిస్తుంది అని విని చాలా షాక్ అయ్యానని అందుకే ఇంటర్నెట్ లో దాని గురించి బాగా వెతికానని , అలా చేయడం ద్వారా మరిన్ని మేలుకులు నేర్చుకున్నానని అంటున్నాడు .

మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన సవ్యసాచి నవంబర్ 2 న భారీ ఎత్తున విడుదలకు సిద్దమయ్యింది . చైతూ సరసన నిధి అగర్వాల్ నటించగా మాధవన్ కీలక పాత్రలో నటించాడు . యాక్షన్ తో పాటుగా సెంటిమెంట్ , లవ్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం పై నాగచైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . యాక్షన్ ఇమేజ్ కావాలని తహతహలాడుతున్న చైతూ కి సవ్యసాచి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే కొద్ది గంటల్లోనే తేలిపోనుంది . ఇక ఈ సినిమాకు సెన్సార్ టాక్ అయితే బాగుంది . ఇక ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండబోతోందో రేపు తెలియనుంది .

- Advertisement -

English Title: Nagachaitanya hopes on Savyasachi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All