HomeVideosసర్కారు వారి పాట ట్రైలర్ టాక్ - మహేష్ చేత జగన్ డైలాగ్

సర్కారు వారి పాట ట్రైలర్ టాక్ – మహేష్ చేత జగన్ డైలాగ్

sarkaru vaari paata trailer talk
sarkaru vaari paata trailer talk

సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మే 12 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ డైలాగ్ ను మహేష్ చేత చెప్పించి ఆకట్టుకున్నారు.

‘నా ప్రేమను దొంగిలించగలవ్.. నా స్నేహాన్నీ దొంగిలించగలవ్.. కానీ నువ్వు నా డబ్బుని మాత్రం దొగించలేవ్’ అంటూ మహేష్ బాబు చేత తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి చెప్పిన డైలాగ్ తో SVP ట్రైలర్ ప్రారంభమవుతుంది. వింటేజ్ మహేష్ ను గుర్తుకు తెచ్చేలా ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ ఉంది. బాడీ లాంగ్వేజ్ – డైలాగ్ డెలివరీ కొత్తగా ఉన్నాయి. ‘అమ్మాయిలను అప్పు ఇచ్చేవాళ్లను పాంపర్ చేయాలిరా.. రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు’ అనే డైలాగ్.. ఏపీ సీఎం జగన్ స్టైల్ లో ‘నేను విన్నాను.. నేను వున్నాను..’ అని చెప్పడం.. ‘దీనెమ్మ మెయింటైన్ చేయలేక దూల తీరిపోతోంది’ ‘దిస్ ఈజ్ మహేష్.. రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలపూడి బీచ్ సర్’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్నిచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – GMB ఎంటర్టైన్మెంట్ – 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని – వై. రవిశంకర్ – రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు ఇక మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All