Homeటాప్ స్టోరీస్సరిలేరు నీకెవ్వరు రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్

సరిలేరు నీకెవ్వరు రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్

సరిలేరు నీకెవ్వరు రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్
సరిలేరు నీకెవ్వరు రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఎబోవ్ యావరేజ్ టాక్ తోనే దూసుకుపోతోంది. మల్టిప్లెక్స్ లలో మెప్పిస్తున్న ఈ చిత్రం సింగిల్ స్క్రీన్స్ లో దుమ్ములేపుతోంది. ముఖ్యంగా బి, సి సెంటర్లలో ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. మహేష్ బాబు చాలా రోజుల తర్వాత మాస్ సినిమా చేయడంతో అభిమానులకు కనువిందుగా మారింది. ముఖ్యంగా డ్యాన్సుల విషయంలో మహేష్ చూపించిన శ్రద్ధకు అభిమానులు ఫిదా అవుతున్నారు. మైండ్ బ్లాక్ సాంగ్ కే అభిమానులు రిపీట్స్ వేసుకోవచ్చు అన్న విధంగా ఉన్నాయి మహేష్ స్టెప్స్. అయితే సినిమా పరంగా లోస్ అండ్ డౌన్స్ ఉండడం ప్రతికూలంగా మారింది. దానికితోడు అల వైకుంఠపురములో వైపు నుండి భారీ పోటీ ఉండడం కూడా కొంత దెబ్బ తీస్తోంది. ఏదేమైనా సరిలేరు నీకెవ్వరు రెండు రోజుల కలెక్షన్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి.

మొదటిరోజు దాదాపు అన్ని సెంటర్లలో విడుదలైన సరిలేరు నీకెవ్వరు రెండు తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసిన విషయం తెల్సిందే. అయితే రెండో రోజు అల వైకుంఠపురములో విడుదలవడంతో దాదాపు 50 శాతానికి పైగా థియేటర్లు కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండో రోజు సరిలేరు నీకెవ్వరు దాదాపు 9.40 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. రెండో రోజు వరల్డ్ వైడ్ కూడా లెక్క వేసుకుంటే దాదాపు 60 కోట్ల షేర్ కు దగ్గరగా ఉంటుంది. దాదాపుగా 60 శాతం వసూళ్లు రెండు రోజుల్లోనే రావడం, ఇంకా రేపటి నుండి సంక్రాంతి పండగ మొదలుకానుండడం వంటివి సినిమాకు ప్లస్ అవనున్నాయి.

- Advertisement -

సరిలేరు నీకెవ్వరు రెండు రోజుల కలెక్షన్స్ వివరాలు:

నైజాం 12.68 కోట్లు
సీడెడ్ 5.15 కోట్లు
నెల్లూరు 1.55 కోట్లు
కృష్ణ 3.75 కోట్లు
గుంటూరు 5.64 కోట్లు
వైజాగ్ 5.46 కోట్లు
ఈస్ట్ 4.04 కోట్లు
వెస్ట్ 3.15 కోట్లు
ఆంధ్ర + తెలంగాణ 41.42 కోట్లు

సరిలేరు నీకెవ్వరు రెండు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మరికొన్ని గంటల్లో మీ ముందు ఉంటాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All