Homeటాప్ స్టోరీస్సరిలేరు నీకెవ్వరు 11 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

సరిలేరు నీకెవ్వరు 11 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

సరిలేరు నీకెవ్వరు 11 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
సరిలేరు నీకెవ్వరు 11 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి జనవరి 11న విడుదలై సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించిన విషయం తెల్సిందే. ఈ సినిమా మొదటి రోజు నుండే కలెక్షన్స్ ఊపు చూపించింది. పోటీగా అల వైకుంఠపురములో ఉన్నా కూడా కలెక్షన్స్ కు ఢోకా లేకుండా పోయింది. ఫలితంగా సరిలేరు నీకెవ్వరు తెలుగు రాష్ట్రాల నుండే 100 కోట్ల షేర్ ను సాధించింది. వరల్డ్ వైడ్ ను లెక్కేసుకుంటే సరిలేరు నీకెవ్వరు దాదాపు 200 కోట్ల పైన గ్రాస్ తో మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అయితే సంక్రాంతి సెలవులు ముగిసి వర్కింగ్ డేస్ మొదలవ్వడంతో సరిలేరు నీకెవ్వరు చిత్రానికి వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. మొన్న 3 కోట్ల పైన షేర్ రాగా ఈరోజు అది మరింత తగ్గి 2 కోట్లకు పరిమితమైంది. ఏదేమైనా 11 రోజుల రన్ లో ఈ చిత్రం 102 కోట్ల పైన షేర్ ను వసూలు చేసింది. సైరా చిత్ర వసూళ్లను అధిగమించాలంటే మరో రెండు కోట్లు వస్తే సరిపోతుంది. మరి ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

సరిలేరు నీకెవ్వరు 11 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్

నైజాం : 33.54 కోట్లు
సీడెడ్ : 14.4 కోట్లు
గుంటూరు : 9.1 కోట్లు
ఉత్తరాంధ్ర : 17.15 కోట్లు
తూర్పు గోదావరి : 10.25 కోట్లు
పశ్చిమ గోదావరి : 6.71 కోట్లు
కృష్ణా : 8.09 కోట్లు
నెల్లూరు : 3.73 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ : 102.97 కోట్లు

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All