HomeVideosపోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా HER.. సరిగమ చేతికి ఆడియో రైట్స్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా HER.. సరిగమ చేతికి ఆడియో రైట్స్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా HER.. సరిగమ చేతికి ఆడియో రైట్స్
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా HER.. సరిగమ చేతికి ఆడియో రైట్స్

చిలసౌ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్న రుహాణి శర్మ.. HIT మూవీతో టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు HER డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ సొంతం చేసుకుంది.

రీసెంట్ గానే నాచురల్ స్టార్ నాని (Nani) చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ టీజర్ లో రుహాణి శర్మ క్యారెక్టర్ హైలైట్ అయింది. ఆమె ఓ చాలెంజింగ్ రోల్ చేసిందని వీడియోలోని సన్నివేశాలు ప్రూవ్ చేశాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ బాణీలు కడుతున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

తారాగణం: రుహాని శర్మ, వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ, రవి ప్రకాష్.

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: శ్రీధర్ స్వరాఘవ్
నిర్మాతలు: రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి
బ్యానర్: డబుల్ అప్ మీడియా
DOP: విష్ణు బేసి
ఎడిటింగ్: చాణక్య తూరుపు
సంగీతం: పవన్
PRO: సాయి సతీష్, పర్వతనేని

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All