
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ, అదే చిత్రాన్ని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా వచ్చిన కబీర్ సింగ్ అక్కడ 300 కోట్లు కొల్లగొట్టి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత సందీప్ వంగ ఎలాంటి సినిమా చేయనున్నాడా, ఎక్కడ చేస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూసారందరూ.
మహేష్ బాబుకు లైన్ వినిపించానని సందీప్ వంగ చెప్పడంతో తెలుగులోనే తన నెక్స్ట్ సినిమా ఉండనుందని అందరూ అంచనా వేశారు. తన తర్వాతి సినిమా ఒక క్రైమ్ కామెడీ అని సందీప్ ప్రకటించాడు కూడా. అయితే ఇప్పుడు తన తర్వాతి సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. సందీప్ వంగ తన తర్వాతి చిత్రాన్ని కూడా బాలీవుడ్ లోనే చేయనున్నాడు.
కబీర్ సింగ్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే మరోమారు సందీప్ తో కలిసి పనిచేయనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోగా రణ్వీర్ సింగ్ నటించే సూచనలు ఉన్నాయి. ఈ మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. ఈ ప్రకటనతో మహేష్ తో సందీప్ వంగ సినిమాపై వస్తున్న వార్తలకు తెరపడినట్లయింది.
BIGGG NEWS… #ArjunReddy and #KabirSingh director Sandeep Reddy Vanga’s next film is a crime drama… Not titled yet… Bhushan Kumar and Murad Khetani – who produced the Blockbuster #KabirSingh – will produce this film with Vanga… Cast will be announced soon. pic.twitter.com/p00YqXYIpI
— taran adarsh (@taran_adarsh) October 10, 2019