Homeటాప్ స్టోరీస్ఆ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారా

ఆ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారా

samrat and tejaswi are in loveబిగ్ బాస్ 2 లో పార్టిసిపేట్ చేసిన సామ్రాట్ , తేజస్వి ప్రేమించుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి . సామ్రాట్ పలు చిత్రాల్లో నటించాడు అంతేకాదు కొన్ని చిత్రాల్లో మెయిన్ క్యారెక్టర్ లు కూడా చేసాడు కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు ,ఇటీవలే మంచు లక్ష్మి నటించిన ” వైఫ్ ఆఫ్ రామ్ ” చిత్రంలో మంచు లక్ష్మి భర్తగా కూడా నటించాడు . ఇక తేజస్వి విషయానికి వస్తే ……. హీరోయిన్ గా నటించిన చిత్రాలు సక్సెస్ కాలేదు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం బాగానే రాణిస్తోంది . పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా బిగ్ బాస్ 2 లో పార్టిసిపేట్ చేస్తోంది .

బిగ్ బాస్ 2 లో పాల్గొన్న సామ్రాట్ తేజస్వి కోసం తన గడ్డాన్ని , మీసాన్ని త్యాగం చేయడంతో ఇద్దరి మధ్య రిలేషన్ పెరిగిందని , మనసులు దగ్గరయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇక షోలో కూడా ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేమ ఉందో మిగతా వాళ్లకు అర్ధం అయ్యేలా చేస్తున్నారు . సామ్రాట్ పెళ్లి పెద్ద వివాదం అయిన విషయం తెలిసిందే . సామ్రాట్ పై అతడి భార్య పలు ఆరోపణలు చేసి అతడికి దూరంగా ఉంటోంది . దాంతో నేనేంటో నిరూపించుకోవడానికే బిగ్ బాస్ 2 కి వచ్చానని అంటున్నాడు . తేజస్వి – సామ్రాట్ ల మధ్య ఉంది స్నేహమా ? ప్రేమా ? అన్నది తెలియాలంటే వాళ్లిద్దరూ నోరు విప్పాల్సిందే .

- Advertisement -

English Title: samrat and tejaswi are in love ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All