Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 2 వల్ల రెండు గంటలు బొక్కట

బిగ్ బాస్ 2 వల్ల రెండు గంటలు బొక్కట

Ex police officer lakshmi narayana sensational comments on bigg boss 2 showబిగ్ బాస్ 2 వల్ల రెండు గంటల సమయం బొక్క తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. వై ఎస్ జగన్ కేసులో జగన్ కు ముచ్చెమటలు పోయించి కేసులు నమోదు చేయడమే కాకుండా జగన్ ని జైల్లో పెట్టించిన ఆఫీసర్ ఈ లక్ష్మినారాయణ . కాగా ఇటీవలే పదవీ విరమణ చేసి ప్రజాసేవలో తరించిపోతున్నాడు ఈ అధికారి. యువతకు ఈ సమయం ఎంతో విలువైనదని కానీ దాన్ని బిగ్ బాస్ కోసం వినియోగిస్తూ రోజుకు రెండు గంటలు సమయం వృధా చేసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు. బిగ్ బాస్ పనికిమాలిన షో అని యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని రూపొందించారని దానికి సమయం కేటాయించడం వృధా అని తేల్చిపడేసాడు లక్ష్మినారాయణ.

ఎన్టీఆర్ బిగ్ బాస్ షో మొదటి సీజన్ చేయగా నాని రెండో సీజన్ చేస్తున్నాడు అయితే ఎన్టీఆర్ స్థాయిలో నాని తన యాంకరింగ్ తో ఆకట్టుకోవడం లేదు. అలాగే ఎన్టీఆర్ తో పోల్చితే బిగ్ బాస్ 2 ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు కూడా . ప్రతీ రోజు ఈ షో రెండు గంటల పాటు వస్తుంది కాబట్టి యువత ఆ రెండు గంటలు టివి కి అతుక్కుపోతున్నారు . దాంతో ఆ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు హాయిగా చదువుకోండి , విజ్ఞానం సంపాదించి ప్రయోజకులు అవ్వండి అని హితబోధ చేస్తున్నాడు . అయితే వింటారా ? ఆహా ….. వింటారా అని ? అన్నట్లు ఈ మాజీ పోలీసు అధికారి రాజకీయాలలోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇతగాడు మాత్రం ఇంకా ఆ విషయంలో స్పందించడం లేదు.

- Advertisement -

English Title: ex police officer lakshmi narayana sensational comments on bigg boss 2 show

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All