Homeన్యూస్సంపూర్ణేష్ బాబు, సలోని టక్కరి దొంగ..చక్కని చుక్క

సంపూర్ణేష్ బాబు, సలోని టక్కరి దొంగ..చక్కని చుక్క

takkari donga chakkani chukkaగతంలో అలీ కథానాయకుడిగా అల్లరి పెళ్లికొడుకు చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జె.జె.ప్రకాష్ రావు, నిర్మాత ఎం.రాజ్ కుమార్ కలయికలో తాజాగా మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. టక్కరి దొంగ..చక్కనిచుక్క పేరుతో ఆర్.కె. ఫిలిం ఫ్యాక్టరీస్ పతాకంపై జె.జె.ప్రకాష్ రావు దర్శకత్వంలో నిర్మించబోయే ఈ నూతన చిత్రంలో ప్రముఖ కథానాయకుడు సంపూర్ణేష్ బాబు, ప్రముఖ కథానాయిక సలోని నాయకానాయికలుగా నటించనున్నట్లు నిర్మాత ఎం.రాజ్ కుమార్ తెలిపారు. జులై రెండోవారంలో షూటింగ్ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. దర్శకుడు జె.జె.ప్రకాష్ రావు మాట్లాడుతూ, లవ్, కామెడీ ఎంటర్ టైనర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని, స్క్రిప్టు ఛాలాబాగా వచ్చిందని, ఇందులో నాలుగు ఫైట్లు, ఆరు పాటలు ఉంటాయని తెలిపారు.

ఈ చిత్రానికి మాటలు-మరుదూరి రాజా, పాటలు-చంద్రబోస్, సంగీతం-వందమాతరం శ్రీనివాస్, కెమెరా-పైడాల శ్రీనివాస్, ఎడిటింగ్-గౌతంరాజు, కళ-బాబా, రచనా సహకారం-కాంచనపల్లి, నిర్మాత-ఎం.రాజ్ కుమార్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం-జె.జె.ప్రకాష్ రావు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts