
టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ `పుష్ప` తరువాత తెలంగాణ రైతాంగ పోరాటం నేపథ్యంలో సినిమా చేయబోతున్నానని, ఇందుకు సంబంధించిన బుక్‌ని ఇప్పటికే పరిశీలించి కథని సిద్ధం చేయబోతున్నానని సుకుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదే కథకు సంబంధం వున్న నేపథ్యంలో దర్శకుడు సంపత్‌నంది సినిమా చేయాలనుకుంటున్నాడట.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం నిరంకుశ ప్రభుత్వ విధానాలకు, ఆ ప్రభుత్వానికి అండగా వుండి సామాన్య జనాన్ని నరరూప రాక్షసులుగా పీక్కుతున్న రజాకార్లకు వ్యతిరేకంగా జరిగింది. సుకుమార్ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ఎంచుకుంటే సంపత్‌నంది రజాకార్ల నేపథ్యంలో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఆ కథని మెగాస్టార్ చిరంజీవితో చేయాలన్నది తన కల అని వెల్లడించినట్టుతెలిసింది.
సంపత్‌నంది ప్రస్తుతం గోపీచంద్ హీరోగా `సీటీమార్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్నా కథనాయికగా నటిస్తోంది. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా కనిపించబోతోంది. తమన్నాతో పాటు ఇందులో ఓ బాలీవుడ్ హీరోయిన్ కూడా నటించే అవకాశం వుందని తెలిసింది.