Homeన్యూస్`స‌మీర‌మ్` రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌- హీరో య‌శ్వంత్

`స‌మీర‌మ్` రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌- హీరో య‌శ్వంత్

sameeram movie pressmeetఅనిత క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై య‌శ్వంత్, అమ్రితా ఆచార్య జంట‌గా ర‌వి గుండ‌బోయిన ద‌ర్శ‌క‌త్వంలో దేవేంద‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రం ` స‌మీర‌మ్. ఈ చిత్రం ఈ నెల 31న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర హీరో య‌శ్వంత్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లో….

మీ గురించి చెప్పండి?
నా పేరు య‌శ్వంత్. నేను గ‌తంలో కొన్ని షార్ట్ ఫిలింస్, సీరియ‌ల్స్ చేశాను. స‌మీరం నా ఫ‌స్ట్ సినిమా. ఇందులో హీరోగా చేశాను. కథ న‌చ్చి సినిమా క‌మిట‌య్యాను.
ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం ఎలా వ‌చ్చింది?
నేను చేసిన షార్ట్ ఫిలిం న‌చ్చి … క‌థ కు యాప్ట్ అని ద‌ర్శ‌క నిర్మాత‌లు తీసుకున్నారు. ప‌క్కింటి కుర్రాడిలా ఉండే క్యార‌క్ట‌ర్ నాది.
`స‌మీర‌మ్` స్టోరీ గురించి చెబుతారా?
స‌మీరం అంటే చ‌ల్లని గాలి అని మీనింగ్‌. మా మూవీ స్టోరీ కూడా అలాగే ఉంటుంది. అలాగే అమ్మాయి పేరు స‌మీర‌, అబ్బాయి పేరు రామ్ అందుకే `స‌మీర‌మ్` అని పెట్టాం. రామ్ అనే అబ్బాయి స‌మీర అనే అమ్మాయి ఎలా క‌లిశారు. ఒక‌రంటే ఒక‌రికి ప‌డని వీరు, చివ‌ర‌కు ఎలా ఒక్క‌ట‌య్యార‌న్న‌ది క‌థాంశం.

- Advertisement -

కంటెంట్ కొంచెం బోల్డ్ గా ఉన్న‌ట్టుంది?
ఫ‌స్టాఫ్ అంతా ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంది. సెకండాఫ్ పెయిన్ ఫుల్ ల‌వ్ స్టోరీ. అలాగే ఇందులో కాన్సెప్ట్ ప్ర‌కార‌మే బోల్డ్ నెస్ ఉంటుంది త‌ప్ప వ‌ల్గారిటీ ఎక్క‌డా ఉండ‌దు. రొమాన్స్ అనేది ప్ర‌తి ఒక్కిర లైఫ్ లో ఉంటుంది. అలా ఒక జంట ల‌వ్ , రొమాన్స్ అంటూ గ‌డిపాక త‌ర్వాత వారిమ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు వ‌చ్చాయి? ఎలా విడిపోయారు,?చివ‌ర‌కు ఎలా క‌లిశార‌న్న‌ది ఆస‌క్త‌క‌ర‌మైన అంశం.

ఈ పాత్ర కోసం ఏమైనా హోమ్ వ‌ర్క్ చేశారా?
నేను నార్మ‌ల్ లైఫ్ లో చాలా సైలెంట్‌. కానీ , ఇందులో హీరో పాత్ర చాలా ఎన‌ర్జిటిక్ గా ఉంటుంది కాబ‌ట్టి ఈ పాత్ర కోసం చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ఈ విష‌యంలో మా డైర‌క్టర్ గారి స‌పోర్ట్ చాలా ఉంది. వారిని ఫాలో అయిపోయి సినిమా చేశాను.
పాట‌లు, ట్రైల‌ర్స్ చూసిన మీ ఫ్యామిలీ ,ఫ్రెండ్స్ ఎలా స్పందించారు?
ఫ‌స్ట్ సినిమానే ధైర్యంగా బోల్డ్ సినిమా చేశావంటూ కొంత మంది పాజిటివ్ గా , మ‌రి కొంత మంది నెగిటివ్ గా స్పందించారు. రెండింటినీ స‌మానంగా తీసుకున్నా. చూద్దాం రిలీజ్ అయ్యాక రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో.

హీరో అవ‌డానికి ఇనిస్పిరేష‌న్‌?
బిటెక్ లో ఉండ‌గా చూడటానికి బావున్నావు హీరోగా చేయ‌వ‌చ్చు క‌దా అని ఫ్రెండ్స్ ఎంక‌రేజ్ చేశారు. అలా సినిమా ఫీల్డ్ లోకి వ‌చ్చాను. ఒక‌సారి సినిమా పిచ్చి ప‌డితే వ‌ద‌ల‌దుగా. అలా ఉండిపోతుంది. మూడేళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నా.

మీ పాపుల‌ర్ షార్ట్ ఫిలింస్‌?
ఏదో మాయ‌లో, మంచుకురిసే వేళ‌లో, ఐయామ్ గిల్టి షార్ట్ ఫిలింస్ కు మంచి వ్యూస్ వ‌చ్చాయి. చాలా పాపుల‌ర్ అయ్యాయి.

నెక్ట్స్ ప్రాజెక్ట్ ?
`మంచు కురిసే వేళ‌లో` అనే కూల్ గోయింగ్ ల‌వ్ స్టోరి ఒక‌టి చేస్తున్నా. క‌ర్ణాట‌క‌లో షూటింగ్ చేశాం. సినిమా మొత్తం పూర్త‌యింది. ఈ సినిమా గురించి త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాం.

ఫైన‌ల్ గా `స‌మీర‌మ్‌` గురించి చెప్పండి?
స‌మీరమ్ క‌చ్చితంగా ప్ర‌తి ఒక్కరికీ న‌చ్చే చిత్రం. ఈ నెల 31న వ‌స్తోంది. తప్ప‌కుండా సినిమా చూడండి. మీ బ్లెస్సింగ్ అందించి మా టీమ్ ని ఎంక‌రేజ్ చేయండి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All