Homeన్యూస్కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిం ` స‌మీర‌మ్‌` - నిర్మాత అనిత దేవెంద‌ర్ రెడ్డి

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిం ` స‌మీర‌మ్‌` – నిర్మాత అనిత దేవెంద‌ర్ రెడ్డి

sameeram movie press meetవిదేశాల్లో ఉంటూ సినిమా రంగం పై ఆస‌క్తితో య‌శ్వంత్, అమ్రిత జంట‌గా ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో అనిత దేవేందర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 31న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లో…

 

- Advertisement -

మాది వ‌రంగల్. నేను 18 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లాను. మాకు 20 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. మా ఇంట్లో అంతా ఇంజ‌నీర్స్ . త‌ను కూడా ఇంజ‌నీర్ కావాల‌ని అనుకున్నాం. కానీ, నేను మ‌ల్టీ మీడియా చేస్తాను. నా డైర‌క్ష‌న్ అంటే ఇష్టం అన్నాడు. దాంతో నేను ఈ ఫీల్డ్ లోకి వ‌చ్చాను. న‌న్ను ఇండియాకు తీసుకెళ్లు… నా ద‌గ్గ‌ర స్టోరీ ఉంది. షార్ట్ ఫిలిం చేస్తా అన్నాడు. అప్ప‌డు హైద‌రాబాద్ వ‌చ్చాం. మా అబ్బాయి ద‌ర్శ‌క‌త్వంలో `ఐయామ్ గిల్టీ` అనే షార్ట్ ఫిలిం చేశాం. దానికి వ‌రంగ‌ల్ షార్ట ఫిలిం ఫెస్టివ‌ల్ లో ద్వితీయ ఉత్త‌మ షార్ట్ ఫిలింగా అవార్డ్ వ‌చ్చింది. షార్ట్ ఫిలిం కి ఎంతో హెల్ప్ చేసిన ర‌వి ఈ సినిమాకు డైర‌క్ష‌న్ చేశాడు . దీని వ‌ల్ల కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించాం. మంచి టీమ్ ఫామ్ అయింది. అలాగే ఫామ్ అయిన వారే ద‌ర్శ‌కుడు ర‌వి, హీరో య‌శ్వంత్ , హీరోయిన్ అమ్రిత‌. బాధ్య‌త‌ల‌న్నీ ర‌వి మీదే పెట్టాను. త‌నే చూసుకున్నాడు. షార్ట్ ఫిలిం ద్వారా చాలా తెలుసుకున్నాం. ఆ అనుభ‌వంతో ఈ సినిమా నిర్మించాం.

స్టోరీ న‌చ్చి ఈ సినిమా ఒప్పుకోవ‌డం జ‌రిగింది. ఫీల్ గుడ్ మూవీ. ఇటీవ‌ల టెక్నిక‌ల్ టీమ్ తో సినిమా చూశాం. అంద‌రికీ న‌చ్చింది. సినిమాకు సంబంధం లేనివాళ్ల కోసం సినిమా ప్ర‌ద‌ర్శించాం.వాళ్ళంద‌రూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు .నాకు సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది తో ప‌రిచ‌యాలు ఉన్న‌ప్ప‌టికీ నేను ఇంత వ‌రకు ఎవ‌రినీ ఏ విష‌యంలో హెల్ప్ అడ‌గ‌లేదు. అందుకే ఈ సినిమా విష‌యంలో కూడా అడ‌గ‌లేదు. నేను ఒక‌సారితో ఏది వ‌దిలి పెట్ట‌ను. రెండోసారి కూడా ట్రై చేస్తాను. నేను చేసే జాబ్ ప్ర‌కారం కొంచెం ప్రెష‌ర్ ఉండ‌టంతో ఈ సినిమా అంతా డైర‌క్ట‌ర్ మీదే వ‌దిలిపెట్టాను . నేను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో గ‌వ‌ర్న‌మెంట్ కి సంబంధించిన జాబ్ చేస్తున్నా.
ద‌ర్శ‌కుడు నాలుగేళ్లు ఈ క‌థ రెడీ చేసుకున్నాడు. ప్ర‌తిది చాలా క్లారిటీ తో చేశాడు. లొకేష‌న్స్ ముందు చూస‌కొని త‌ర్వాతే షూటింగ్ చేశాం. సినిమా ప‌రంగా చాలా రిచ్ గా ఉంటుంది. ఈ నెల 31న 70 నుండి 100 వ‌ర‌కు సెంట‌ర్స్ లో సినిమా రిలీజ్ చేస్తున్నాం. చాలా మంది డిస్ట్రిబ్యూట‌ర్స్ ముందుకొచ్చినా కాన్సెప్ట్ మీద న‌మ్మ‌కంతో మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. త్వ‌ర‌లో మా త‌దుప‌రి సినిమాకు సంబంధించిన సినిమా ప్ర‌క‌టిస్తాం అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All