Homeన్యూస్స‌మీర‌- రామ్ ల రొమాంటిక్ ల‌వ్ జ‌ర్నీ `స‌మీరమ్`- ద‌ర్శ‌కుడు ర‌వి గుండబోయిన

స‌మీర‌- రామ్ ల రొమాంటిక్ ల‌వ్ జ‌ర్నీ `స‌మీరమ్`- ద‌ర్శ‌కుడు ర‌వి గుండబోయిన

sameeram-movie-press-meet-2కొత్త‌దనాన్ని, కొత్త త‌రాన్ని ప్ర‌జంట్ ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఆ కోవ‌లో వ‌స్తోన్న మ‌రో చిత్రం `స‌మీర‌మ్` . య‌శ్వంత్ , అమ్రిత ఆచార్య జంట‌గా న‌టించిన ఈ చిత్రం ద్వారా ర‌వి గుండబోయిన ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. దేవేంద‌ర్ రెడ్డి నిర్మాత‌. రేపు గ్రాండ్ గా ఈ సినిమా విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు…

మీ గురించి చెప్పండి?
నేను గ‌త ప‌దిహేనేళ్లుగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉంటున్నా. సురేష్ ప్రొడ‌క్ష‌న్ లో చాలా సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేశాను. అలాగే చాలా మంది ద‌ర్శ‌కుల వ‌ద్ద శిష్య‌రికం చేశాను. ఆ అనుభ‌వంతో ఈ సినిమాకు డైర‌క్ష‌న్ చేశాను. ద‌ర్శ‌కుడుగా `స‌మీరమ్‌` నా తొలి సినిమా.

- Advertisement -

`స‌మీర‌మ్` స్టోరి ఎలా ఉంటుంది?
`స‌మీరం` అంటే చ‌ల్ల‌ని గాలి అని అర్థం. స‌మీర అనే అమ్మాయి, రామ్ అనే ఒక అబ్బాయి రొమాంటిక్ ల‌వ్ జ‌ర్నీ `సమీర‌మ్‌` సినిమా. ఫీల్ గుడ్ ఫిలిం. టోట‌ల్ గా థాయ్ లాండ్ లో సినిమా షూటింగ్ చేశాం. లైఫ్ లో ప్ర‌తి ఒక్క‌రూ జ‌రిగే ఇన్సిడెంట్స్ ని బ‌ట్టి క్యార‌క్ట‌ర్స్ మారుతుంటాయి అనేది మా సినిమాలో చూపిస్తున్నాం. ప్ర‌తి ఒక్క‌రూ లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదుర్కొనే ఉంటారు. ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్టయ్యే విధంగా ఉంటుంది. రొటీన్ గా కాకుండా డిఫ‌రెంట్ గా ఉంటుంది.

బోల్డ్ కంటెంట్ ఉన్న‌ట్టుంది?
ప్ర‌తి ఒక్కరి లైఫ్ లో రొమాన్స్ ఉంటుంది. చాలా మంది అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 చిత్రాలను పోల్చి రాస్తున్నారు, చెబుతున్నారు. కానీ, మా సినిమా డిఫ‌రెంట్ గా ఉంటుంది. బోల్డ్ కంటెంట్ ఉన్నా కాన్సెప్ట్ ప్ర‌కారమే ఉంటుంది త‌ప్ప కావాల‌ని పెట్ట‌లేదు.

క‌మర్షియ‌ల్ అంశాలు కూడా ఉన్నాయా?
చిన్న సినిమాల‌కు మెయిన్ క‌థ‌లే. మంచి ల‌వ్ ఉంటుంది. జ‌న్యూన్ ట్రావెల్ ఉంటుంది. ఇలా ప్ర‌తిది సంద‌ర్భానుసారంగానే ఉంటుంది. ఒక క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కావాల్సిన అంశాల‌న్నీమా చిత్రంలో ఉన్నాయి.
ఆడ‌వారిని హ‌ర్ట్ చేసే విధంగా ఉంటుందా?

హీరోలు ఎంజాయ్ చేయ‌డానికి థాయ్ లాండ్ వెళ్ల‌డం అనేది కామ‌న్‌. కానీ , మా సినిమాలో హీరోయిన్ ఎంజాయ్ చేడానికి థాయ్ లాండ్ వెళ్ల‌డం, అక్క‌డ హీరోతో ప‌రిచ‌యం కావ‌డం, ఆ త‌ర్వాత ఏమైంద‌న్న‌ది క‌థ‌. అంటే ఎక్క‌డా ఆడ‌వారిని హ‌ర్ట్ చేసే విధంగా సినిమా ఉండ‌దు. కానీ చాలా మంది మాత్రం క‌చ్చితంగా క నెక్ట‌వుతారు.
మ్యూజిక్ కు ఎలాంటి స్కోపుంది?

యాజ‌మాన్య మంచి సంగీతం ఇచ్చారు. ప్ర‌తి ట్యూన్ సింగిల్ సిట్టింగ్ లోనే ఫైన‌ల్ అయిపోయాయి. తన నేప‌థ్య సంగీతంతో సినిమాను నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లారు. మేము ఊహించ‌న విధంగా పాట‌ల‌కు స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా రొమాంటిక్ సాంగ్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. రాంబాబు గోసాల గారు మంచి సాహిత్యాన్ని
స‌మ‌కూర్చారు.
న‌టీన‌టుల గురించి చెప్పండి?
య‌శ్వంత్ , అమ్రితా ఆచార్య పెయిర్ గా న‌టించారు. ఇద్ద‌రూ కూడా నేను డిజైన్ చేసుకున్న పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. అలాగే దివ్య నంద‌ని సెకండ లీడ్ చేసింది. గెట‌ప్ శీను, రాము, యార్ల‌గ‌డ్డ శైల‌జ గారు మిగ‌తా పాత్ర‌ల్లో న‌టించారు.

నిర్మాత స‌హ‌కారం ఎలా ఉంది?
మా నిర్మాత దేవేంద‌ర్ రెడ్డి గారు ఆస్ట్రేలియా లో ఉంటారు. మ‌రో ప్రొడ్యూస‌ర్ సురేష్ కేశ‌వ‌న్ గారు. వీరిద్ద‌రు మంచి స్నేహితులు. సినిమా ప్రారంభ‌మైన మొద‌టి రోజు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒకే విధంగా స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. ఎక్క‌డా రాజీ పడ‌కుండా అన్ని విధాలుగా స‌హ‌క‌రించారు. మొత్తం బాధ్య‌త‌లు నా పై వేయ‌డంతో చాలా జాగ్ర‌త్త‌గా వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకునేలా సినిమా చేశాను. రేపు సినిమా గ్రాండ్ గా విడుద‌ల‌వుతోంది.మా ప్ర‌య‌త్నాన‌ని ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తార‌ని కోరుకుంటున్నాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All