Homeగాసిప్స్తన నెక్స్ట్ సినిమాను సైన్ చేసిన సమంత

తన నెక్స్ట్ సినిమాను సైన్ చేసిన సమంత

 

samantha signs her next amid rumors
samantha signs her next amid rumors

సమంత అక్కినేని రీసెంట్ గా తన సినిమాల కమిట్మెంట్ ను పూర్తి చేసుకుని కొంత కాలం బ్రేక్ తీసుకుంటానని తెలిపిన విషయం తెల్సిందే. దీంతో సమంత గర్భవతి అని, అందుకే సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటోందని రూమర్స్ వచ్చాయి. ఇక గత కొంత కాలంగా సమంత పర్సనల్ జీవితానికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె తన భర్త నాగ చైతన్య నుండి విడిపోతుందని వార్తలు బలంగా వస్తున్నాయి.

- Advertisement -

అయితే ఇవన్నీ పక్కనపెట్టి సమంత తన కెరీర్ లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఆమె తన నెక్స్ట్ సినిమాను ఖరారు చేసింది. ఒక కొత్త దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయిన సమంత వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

గతంలో జెంటిల్ మ్యాన్, సమ్మోహనం వంటి చిత్రాలను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దసరాకు ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తారు. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All