Homeటాప్ స్టోరీస్రాజమౌళి కి షాక్ ఇచ్చిన సమంత

రాజమౌళి కి షాక్ ఇచ్చిన సమంత

samantha rejected ss rajamouli offer ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాలో నటించమని సమంత ని అడిగితే నటించనని చెప్పి షాక్ ఇచ్చిందట సమంత . ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ సర్కిల్లో సంచలనం సృష్టిస్తోంది . సమంత – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈగ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే . పైగా రాజమౌళి సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు ఎందుకంటే ఓటమి ఎరుగని దర్శక ధీరుడు కాబట్టి . ఈయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే .

తాజాగా ఈ దర్శకుడు ఎన్టీఆర్ – చరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు . ఆ చిత్రంలో హీరోయిన్ లుగా కీర్తి సురేష్ , పూజా హెగ్డే లను తీసుకోనున్నట్లు తెలుస్తోంది అలాగే ఓ కీలక పాత్రలో సమంత ని తీసుకుంటే బాగుంటుందని భావించాడట !అయితే జక్కన్న ఆఫర్ ని నిర్మొహమాటంగా తిరస్కరించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి . ఐతే ఇది నిజమా ? కాదా ? అన్నది తెలియాల్సి ఉంది . ఇక సమంత విషయానికి వస్తే పెళ్లి తర్వాత భారీ హిట్ లు కొడుతోంది ఈ భామ . తాజాగా నాగచైతన్య తో కలిసి ఓ చిత్రంలో నటించడానికి సమాయత్తం అవుతోంది సమంత .

- Advertisement -

English Title: samantha rejected ss rajamouli offer

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All