Homeగాసిప్స్షారుఖ్ సినిమాను కాదనుకున్న సమంత

షారుఖ్ సినిమాను కాదనుకున్న సమంత

షారుఖ్ సినిమాను కాదనుకున్న సమంత
షారుఖ్ సినిమాను కాదనుకున్న సమంత

సమంత రుత్ ప్రభు నాలుగేళ్ల తన వివాహాన్ని రద్దు చేసుకున్న విషయం తెల్సిందే. అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది సమంత. ఇది జరిగిన కొన్ని రోజులకు సమంత వరసగా సినిమాలను సైన్ చేయడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో సమంత సినిమాల గురించి ఒక ఆసక్తికర విషయం బయటపడింది.

కొన్ని నెలల క్రితం ప్రముఖ దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తుండగా హీరోయిన్ గా సమంతను అప్రోచ్ అయ్యాడు. అప్పటికే ఆమెతో తేరి, మెర్సల్ సినిమాల్లో పనిచేయడంతో సమంతను బాలీవుడ్ టాప్ హీరో చిత్రానికి అప్రోచ్ అవ్వగా అప్పుడు పిల్లలను కనాలన్న ఉద్దేశంతో ఉన్న సామ్ ఆ ఆఫర్ ను తిరస్కరించింది.

- Advertisement -

కట్ చేస్తే ఇప్పుడు విడాకులు తీసుకుని మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలనుకుంటోంది. మరోవైపు ఆ ఆఫర్ నయనతారకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అట్లీ మొదటి సినిమా రాజా రాణిలో నయనతార హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.

ఇక చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత రెండు సినిమాలను సైన్ చేసింది. ఈ రెండూ కూడా తెలుగు-తమిళ ద్విభాషా చిత్రాలు కావడం విశేషం. ఖైదీ నిర్మాతలు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో సమంత సైన్ చేసింది. అలాగే సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో కూడా సినిమాకు సమాయత్తమవుతోంది సమంత.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All