Homeటాప్ స్టోరీస్డివోర్స్ కారణాల రూమర్స్ పై స్పందించిన సమంత

డివోర్స్ కారణాల రూమర్స్ పై స్పందించిన సమంత

డివోర్స్ కారణాల రూమర్స్ పై స్పందించిన సమంత
డివోర్స్ కారణాల రూమర్స్ పై స్పందించిన సమంత

అక్కినేని నాగ చైతన్య, సమంత రుత్ ప్రభు విడిపోతున్నట్లు, డివోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ ప్రకటన రాక ముందు వరకూ రకరకాలుగా స్పందించిన కొంత మంది, ప్రకటన వచ్చాక కారణాలు ఏమై ఉంటాయా అన్నది విశ్లేషించడం మొదలుపెట్టారు. కొంత మంది సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదని, అక్కినేని కుటుంబానికి అది నచ్చలేదని, అందుకే డివోర్స్ అన్నారు. మరికొంత మంది ది ఫ్యామిలీ మ్యాన్ 2 ను కారణంగా చూపించారు. ఇంకా కొంత ముందుకు వెళ్లి సమంతకు ఎఫైర్స్ అంటగట్టారు.

వీటన్నిటిపై సమంత స్పందించింది. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేసింది. “నా డివోర్స్ విషయంలో బోలెడన్ని రూమర్స్ షికార్లు చేసాయి. వాటిని డిఫెండ్ చేసి, అవి స్ప్రెడ్ అవ్వకుండా చూసిన వారికి చాలా థాంక్స్. డివోర్స్ అనేదే చాలా కష్టతరమైన విషయం. నేను తిరిగి బౌన్స్ బ్యాక్ ఇవ్వడానికి సమయం ఇవ్వడం మానేసి నా మీద పర్సనల్ ఎటాక్ విచారకరం. నేను ప్రామిస్ చేస్తున్నా, నేను ఇది అనుమతించను. అలాగే వారు స్ప్రెడ్ చేసే రూమర్స్ నన్ను కిందపడేయలేవు” అని సమంత స్పందించింది.

- Advertisement -

ఎంత సెలబ్రిటీ జీవితమైనా వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం అనే మానసిక జబ్బు మనకు పోయే దాకా ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండవు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All