
స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఏది చేసినా స్పెషలే. ఎందుకంటే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ పాజిటివ్‌గా వుంటూ తన చుట్టూ వున్న వాళ్లూ కూడా అదే మూడ్‌లో వుండాలని కోరుకుంటుంది కాబట్టి. ప్రతి నిమిషాన్ని పాజిటివ్ దృక్పథంలో చూస్తూ ఎంజాయ్ చేయాలని భావిస్తుంటుంది. లాక్‌డౌన్ సమయంలో టెర్రాస్‌పై వ్యవసాయం చేసి పలువురిని ఆశ్చర్యపరిచిన సామ్ త్వరలో ఫ్యామిలీమ్యాన్ సిరీస్2తో మరింత షాకివ్వబోతోంది.
ఇందులో తొలిసారి నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో టెర్రరిస్టుగా కనిపించబోతోంది. ఇటీవలే తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పుకున్న సామ్ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తోంది. ఇదిలా వుంటే తాజాగా నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా మాల్దీవ్స్‌కి చైతో కలిసి సామ్ వెకేషన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి బీచ్‌లో చైతో కలిసి సామ్ హంగామా చేస్తోంది. తాజాగా ఇన్‌స్టాలో సామ్ పోస్ట్ చేసిన గ్లామర్ ఫొటో.. అందులో సమంత పెట్టిన పోజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సెల్ఫీకి ‘నేను మాత్రమే అయిపోయాను’ అంటూ సామ్ క్యాప్షన్ ఇచ్చింది. సామ్ బాత్ టబ్‌లో కూర్చుని తీసుకున్న ఈ చిలిపి సెల్ఫీ కొంత మందికి నవ్వులు పూయిస్తుంటే కొంత మందిని మాత్రం హీటెక్కిస్తోంది. సామ్ ఇంత హాట్‌గా అందాల విందు చేస్తూ సెల్ఫీకి పోజులు ఇవ్వడం ఇదే తొలిసారి కావడంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది.