Homeఎక్స్ క్లూసివ్యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేసిన సమంత

యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేసిన సమంత

యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేసిన సమంత
యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేసిన సమంత

అక్కినేని నాగ చైతన్య, సమంత తాము విడాకులు తీసుకుంటున్నాం, విడిపోయాం అని ప్రకటించిన తర్వాత చాలా మంది ఆ వార్తను కవర్ చేయడానికి ఉత్సాహం చూపించారు. అంతటితో ఆగిపోకుండా అసలు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేదానికి ఎవరికి నచ్చినట్లు వారు ఎనాలిసిస్ ఇవ్వడం కొసమెరుపు. ఈ తతంగం ఒక్కరోజుకు పరిమితమైంది కాదు, చాలా రోజుల పాటు సాగింది. సాటిలైట్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా కూడా ఎందుకు విడిపోయి ఉండవచ్చు అని కవర్ చేసారు.

సమంత ఈ వార్తలకు హర్ట్ అయ్యి ఒక పోస్ట్ కూడా వేసింది, అయినా కూడా ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడా తగ్గలేదు. సమంతదే ఈ విషయంలో తప్పు అన్నట్లుగా ప్రవర్తించాయి. సమంత సోషల్ మీడియాలో వేరే వ్యక్తితో ఫోటోలు షేర్ చేయడం, ఆమె చేసిన బోల్డ్ సిరీస్, ఇంకా పలు కారణాలను ఎత్తి చూపాయి.

- Advertisement -

ఫైనల్ గా సమంత ఈ విషయంలో న్యాయపోరాటానికి సిద్ధమైంది. ముఖ్యంగా మూడు యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేసింది. సుమన్ టివి, తెలుగు పాపులర్ టివి, టాప్ తెలుగు టీవీలు విడాకుల వ్యవహారంపై చాలా కథనాలు ప్రచురించాయి. అలాగే సిఎల్ వెంకట్రావు అనే వైద్యుడు కూడా ఈ విషయంలో ఎనాలిసిస్ వీడియోలు ప్రచురించడంతో ఆ మూడు ఛానల్స్ తో పాటు ఆయన మీద కూడా పరువునష్టం దావా వేసింది.

ఆ వీడియోలను తక్షణమే డిలీట్ చేయడంతో పాటు తన పరువుకు భంగం కలిగింది కాబట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. కూకట్ పల్లి కోర్టులో ఈ కేసుపై ఈరోజు విచారణ జరిగింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All