Homeటాప్ స్టోరీస్స్లీప‌ర్ సెల్‌గా అక్కినేని వారి కోడ‌లు!

స్లీప‌ర్ సెల్‌గా అక్కినేని వారి కోడ‌లు!

స్లీప‌ర్ సెల్‌గా అక్కినేని వారి కోడ‌లు!
స్లీప‌ర్ సెల్‌గా అక్కినేని వారి కోడ‌లు!

టెర్ర‌రిజ‌మ్ పేరు చెప్ప‌గానే వినిపించే మ‌రో పేరు స్లీప‌ర్ సెల్స్‌. ఎలాంటి యాక్టివిటీని నిర్వ‌హించ‌కుండా అద‌నుకోసం టెర్ర‌రిస్టులు వాడే ప్ర‌మాద‌క‌ర వ్య‌క్తులే ఈ స్లీప‌ర్ సెల్స్‌. విజ‌య్ హీరోగా ఏ.ఆర్‌. మురుగ‌దాస్ తెర‌కెక్కించిన `తుపాకి` చిత్రంలో స్లీ‌ప‌ర్ సెల్స్ గురించి వారి యాక్టివిటీ గురించి చాలా స్పష్టంగా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇదే త‌ర‌హా పాత్ర‌లో అక్కినేని వారి కోడ‌లు, స్టార్ హీరోయిన్  స‌మంత క‌నిపించ‌బోతోంది.

రాజ్‌. ఎన్‌.డీకే తెర‌కెక్కించిన సంచ‌ల‌న వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్‌`. పాకిస్థానీ టెర్ర‌రిజ‌మ్ నేప‌థ్యంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ సంచ‌ల‌నం సృష్టించింది. వాస్త‌విక కోణంలో రాజ్ ఎన్‌. డీకే ఈ వెబ్ సిరీస్‌ని అత్యంత స‌హ‌జ సిద్ధంగా తెర‌కెక్కించ‌డంతో వీరిపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. మ‌నోజ్ బాజ్‌పాయ్‌, ప్రియ‌మ‌ణి, క‌న్న‌డ న‌టుడు కిషోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ వెబ్ సిరీస్‌కి ప్ర‌స్తుతం సీక్వెల్‌గా `ఫ్యామిలీ మ్యాన్ 2`ని రూపొందిస్తున్నారు.

- Advertisement -

ఇందులో స‌మంత కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. పాకిస్థానీ టెర్ర‌రిస్టుగా ఇండియాలో వారికి అనుకూలంగా ప‌నిచేసే స్లీప‌ర్ సెల్‌గా ఆమె పాత్ర చాలా భిన్నంగా, షాకింగ్‌గా వుంటుంద‌ని తెలిసింది. స‌మంత తొలిసారి నెగెటివ్ పాత్ర‌లో న‌టిస్తున్న తొలి వెబ్ సిరీస్ కావ‌డంతో `ఫ్యామిలీ మ్యాన్ 2` క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది. ప్ర‌స్తుతం స‌మంత త‌న పాత్ర‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ని పూర్తి చేసే ప‌నిలో వుంద‌ట‌. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి పార్ట్ 2ని ఆమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All