Homeటాప్ స్టోరీస్లేటెస్ట్ ఫోటోషూట్ లో సామ్ మెరుపులు

లేటెస్ట్ ఫోటోషూట్ లో సామ్ మెరుపులు

లేటెస్ట్ ఫోటోషూట్ లో సామ్ మెరుపులు
లేటెస్ట్ ఫోటోషూట్ లో సామ్ మెరుపులు

సమంత అక్కినేని నుండి సమంత రుత్ ప్రభుగా మారిపోయింది సామ్. నాగ చైతన్య నుండి ఆమె విడిపోతున్నట్లు ప్రకటించగానే అనవసర వివాదాల్లోకి ఆమెను లాగారు. అప్పటినుండి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోన్న సమంత రీసెంట్ గా మళ్ళీ పోస్ట్ లను చేయడం మొదలుపెట్టింది. రీసెంట్ గా ఆమె నాగ చైతన్యతో పోస్ట్ చేసిన పెళ్లి ఫోటోలను తన ఇన్స్టా అకౌంట్ నుండి డిలీట్ చేసిన విషయం తెల్సిందే.

సమంత మళ్ళీ తన కొత్త జీవితాన్ని తిరిగి మొదలుపెడుతుంది సమంత. తన స్నేహితులతో కలిసి ట్రిప్స్ ను పూర్తి చేసుకుని వచ్చిన సామ్ తిరిగి ప్రొఫెషనల్ కెరీర్ వైపు దృష్టి సారించింది. రెండు తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రాలను సమంత ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాల షూటింగ్స్ త్వరలోనే మొదలవుతాయి. ఇదిలా ఉంటే సమంత బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.

- Advertisement -

తాప్సి నెలకొల్పిన బ్యానర్ లో సమంత సినిమా చేయనుందని ప్రచారం జరిగింది. ఇందులో ఎంత నిజముంది అన్నది త్వరలోనే తెలుస్తుంది. ఇదిలా ఉంటే సమంత మళ్ళీ ఫోటోషూట్స్ పై ఫోకస్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో తిరిగి రీసెంట్ ఫోటోషూట్స్ ను పోస్ట్ చేస్తోంది సమంత. రీసెంట్ గా సామ్ పోస్ట్ చేసిన ఫోటోషూట్ లో ఆమె మెరిసిపోతోంది. మునుపటి గ్లో కూడా అలానే ఉండటం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All