Homeటాప్ స్టోరీస్వంద కోట్ల క్లబ్ లో సల్మాన్ రేస్ 3

వంద కోట్ల క్లబ్ లో సల్మాన్ రేస్ 3

salman khan race 3 joins 100 crore club in just 3 days సల్మాన్ ఖాన్ నటించిన ”రేస్ 3 ” మూడు రోజుల్లో వంద కోట్ల ని సాధించేసింది . జూన్ 15న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ”రేస్ 3” చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది . అయితే సల్మాన్ ఖాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం , రంజాన్ పర్వదినాలు కావడంతో రేస్ 3 కి బాగా కలిసొచ్చాయి దాంతో మూడు రోజుల్లో వంద కోట్లకు పైగా వసూల్ చేసి సల్మాన్ సత్తా ఏంటో చూపించింది . రిలీజ్ అయిన శుక్రవారం రోజున 29. 17 కోట్లు , శనివారం రోజున 38. 14 కోట్లు ఆదివారం రోజున 39. 14 కోట్లు వసూల్ చేసింది రేస్ 3 చిత్రం .

అయితే వీకెండ్స్ కావడం , సల్మాన్ ఖాన్ కి క్రేజ్ ఉండటం వల్ల ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి ఇక ఈరోజు నుండి సల్మాన్ ఖాన్ కి అసలు సిసలైన పరీక్ష . సినిమాకు పూర్తిగా ప్లాప్ టాక్ వచ్చింది అయితే టాక్ తో సంబంధం లేకుండా మొదటి మూడు రోజులు వసూళ్లు వచ్చాయి కానీ ఈరోజు నుండి ఆ స్థాయి వసూళ్లు సాధ్యం కాదు . రెమో డిసౌజా భారీ అంచనాలను పెంచాడు కానీ ఆ స్థాయిలో అలరించలేక పోయాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All