Homeటాప్ స్టోరీస్సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర

సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర

hero salman khan got threat haryana sharp shooterబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని హత్య చేయడానికి భారీ ఎత్తున కుట్ర పన్నారట ! అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో షాక్ అయ్యారు . సల్మాన్ ఖాన్ ని అన్ని మతాల వాళ్ళు ఆదరిస్తున్న ఈ సమయంలో అతడ్ని హత్య చేయించాల్సిన అవసరం ఎవరికుంది అని అనుకుంటున్నారా ? కృష్ణ జింక ని తమ ఆరాధ్య దైవంగా భావించే తెగ కు చెందిన వాళ్ళు సల్మాన్ ఖాన్ ని హత్య చేయించాలని పథకం పన్నారు . హరియాణా కు చెందిన షార్ప్ షూటర్ సంపత్ నెహ్రా తో ఒప్పందం చేసుకున్నారు .

సుపారీ తీసుకున్న షార్ప్ షూటర్ సంపత్ సల్మాన్ ని హత్య చేయడానికి ముంబై వెళ్లి రెక్కీ కూడా నిర్వహించాడట ! అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో నిఘా పెట్టి సంపత్ ని అరెస్ట్ చేసారు . సంపత్ అరెస్ట్ అయ్యాడు కానీ అతడి ముఠాలోని మిగతా సభ్యులు తప్పించుకోవడంతో వాళ్ళ కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు . సల్మాన్ పై బిష్ణోయ్ తెగ వాళ్లకు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ….. రాజస్థాన్ లో కృష్ణ జింక లను సల్మాన్ వేటాడిన విషయం తెలిసిందే . కోర్టులో సల్మాన్ కి శిక్ష పడలేదని ఆగ్రహంతో ఊగిపోతున్నారు బిష్ణోయ్ తెగ వాళ్ళు . దాంతో ఈ దుస్సాహసానికి పూనుకున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All