HomeVideosయూట్యూబ్‌ని ఓ ఊపు ఊపేస్తున్న `సారంగ ద‌రియా..`!

యూట్యూబ్‌ని ఓ ఊపు ఊపేస్తున్న `సారంగ ద‌రియా..`!

యూట్యూబ్‌ని ఓ ఊపు ఊపేస్తున్న `సారంగ ద‌రియా..`!
యూట్యూబ్‌ని ఓ ఊపు ఊపేస్తున్న `సారంగ ద‌రియా..`!

శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న చిత్రం `ల‌వ్‌స్టోరీ`. నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పీ, అమిగోస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్ పై నారాయ‌ణ్‌దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 16న ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం మ్యూజిక్ ప్ర‌మోష‌న్స్‌ని ప్రారంభించింది.

తాజాగా ఈ సినిమా నుంచి సాయి ప‌ల్ల‌విపై చిత్రీక‌రించిన `సారంగ ద‌రియా..` లిరిక‌ల్ వీడియోని స్టార్ హీరోయిన్ స‌మంత రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా మంగ్లీ ఆల‌పించింది. శశేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య రీతులు స‌మ‌కూర్చిన ఈ  పాట ప్ర‌స్తుతం యూట్యూబ్ ని ఓ ఊపు ఊపేస్తోంది. విడుద‌లైన గంట‌ల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌ని సొంతం చేసుకుంది.

- Advertisement -

ఇప్ప‌టి వ‌ర‌కు 17 ప్ల‌స్ మిలియ‌న్ వ్యూస్‌ని క్రాస్ చేసి దూసుకుపోతోంది. త్వ‌ర‌లో మ‌రో మైలు రాయిని దాటి రికార్డు సృష్టించ‌డం ఖాయం అని చెబుతున్నారు. ఓ సున్నిత‌మైన ల‌వ్‌స్టోరీ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All