
టాలీవుడ్ మన్నథుడు అక్కినేని నాగార్జునకు డిసెంబర్ నెల అంటే సెంటిమెంట్. ఆ నెలలో రిలీజైన నాగ్ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్‌గా మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ ఫాలో అవుతున్నాడు. సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న తాజా చిత్రం `సోలో బ్రతుకే సోబెటర్`. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపీనీడు నిర్మిస్తున్నారు.
నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ సింగిల్ ఫర్ ఎవర్ అనే కాన్సెప్ట్ నేపథ్యంలో రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించడం లేదు. ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలు డేట్స్‌ని లాక్ చేసేశాయి. రానా `అరణ్య`, రవితేజ `క్రాక్`, అఖిల్ అక్కినేని `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి.
అయితే వీటితో పోటీపడేందుకు హీరో సాయిధరమ్‌తేజ్ ఇష్టపడటం లేదు. డిసెంబర్‌కే తన చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. పైగా ఈ నెల తనకు సెంటిమెంట్ కాబట్టి ఇదే నెల మూడవ వారంలో `సోలో బ్రతుకే సో బెటర్` చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలిసింది. సాయి ధరమ్‌తేజ్ నటించిన `ప్రతి రోజు పండగే` గత ఏడాది డిసెంబర్ లో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెలని సాయిధరమ్‌తేజ్ సెంటిమెంట్‌గా భావిస్తున్నాడట.