Homeన్యూస్మొన్న మలర్.. నిన్న భానుమతి.. నేడు మౌనిక..!

మొన్న మలర్.. నిన్న భానుమతి.. నేడు మౌనిక..!

Sai Pallavi Love Story Acting Dance Audience Reaction
 

మళయాళ మూవీ ప్రేమం సినిమాతో సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో ఫిదాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక లేటెస్ట్ గా లవ్ స్టోరీతో మరోసారి తన మ్యాజిక్ చూపిస్తుంది సాయి పల్లవి. ప్రేమం సినిమాలో మలర్ పాత్రతో పాపులర్ అయిన సాయి పల్లవి ఫిదాలో భానుమతి హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ అంటూ యూత్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసినా మళ్లీ అదే శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

సినిమాలో మౌని అలియాస్ మౌనిక పాత్రలో సాయి పల్లవి మరోసారి తమ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ చూపించింది. నటన మాత్రమే కాదు డ్యాన్స్ తో సాయి పల్లవి కేక అనిపిస్తుంది. లవ్ స్టోరీ సినిమాలో కూడా సారంగ దరియ సాంగ్ తో పాటుగా ఫస్ట్ హాఫ్ లో రెయిన్ సాంగ్ లో సాయి పల్లవి డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

- Advertisement -

సినిమాలో సాయి పల్లవి ఉంది అంటే పాత్ర ప్రాధాన్యతతో పాటుగా ఆమె చేసే డ్యాన్స్ కూడా హైలెట్ గా నిలిచేలా ఉంటుంది. ఇక ఆమె చేసే సాంగ్స్ యూట్యూబ్ రికార్డుల జోరు కొనసాగాల్సిందే. ఏది ఏమైనా హీరో ఎవరైనా హీరోయిన్ కోసం సినిమా చూసే ఆడియెన్స్ ఉన్నారు అంటే అక్కడ ఉంది సాయి పల్లవి లాంటి కథానాయిక అని చెప్పొచ్చు. మొన్న మలర్.. నిన్న భానుమతి.. నేడు మౌనిక పాత్రల్లో సాయి పల్లవి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుందని చెప్పొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All