Homeటాప్ స్టోరీస్అనుష్క దర్శకుడితో మెగా మేనల్లుడు

అనుష్క దర్శకుడితో మెగా మేనల్లుడు

Sai dharam tej next film with anushka's directorమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా విఫలమవుతున్నాడు . ఈ ఏడాది చేసిన రెండు సినిమాలు కూడా ఘోర పరాజయం పొందాయి దాంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు . తర్వాత నేను శైలజ వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి అనే సినిమా చేస్తున్నాడు . అంతేకాదు తాజాగా మరో సినిమా కూడా ఒప్పుకున్నాడట మెగా మేనల్లుడు .

ఇంతకీ సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా దర్శకుడు ఎవరయ్యా అంటే అశోక్ . పిల్ల జమిందార్ , భాగమతి వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఈ అశోక్ . అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది . కాగా ఆ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో తన తదుపరి చిత్రాన్ని అశోక్ తో చేయడానికి అంగీకరించాడట . మంచి సక్సెస్ లు సాధించి మంచి జోష్ మీదున్నాడు అని అనుకునే సరికి డిజాస్టర్ లతో చతికిల బడ్డాడు . మరి చిత్రలహరి , అశోక్ ల సినిమాలతో మళ్ళీ గాడిన పడతాడా ? లేక షరా మాములేనా ?

- Advertisement -

English Title: Sai dharam tej next film with anushka’s director

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All