Homeటాప్ స్టోరీస్సాయి ధరమ్ తేజ్ తమ్ముడి సినిమా మొదలైంది

సాయి ధరమ్ తేజ్ తమ్ముడి సినిమా మొదలైంది

sai dharam tej brother vaishnav tej debut with director sagar chandraమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది అయితే ఈ సినిమాని ఎలాంటి హడావుడి లేకుండా మొదలుపెట్టారు . చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎం బిబిఎస్ చిత్రంలో వైష్ణవ్ తేజ్ నటించాడు , ఆ సినిమాలో కుర్చీకే పరిమితమైయ్యే చిన్న కుర్రాడి పాత్ర ఉంది కదా ! ఆ కుర్రాడే మెగా స్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ . సాయిధరమ్ తేజ్ కి తమ్ముడు . ఇతడికి కూడా సినిమాల్లో నటించాలి ఆసక్తి ఉండేది అయితే యాక్టింగ్ లో , డ్యాన్స్ లో శిక్షణ తీసుకొని ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చాడు .

ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా …… ” అప్పట్లో ఒకడుండేవాడు ” వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర . నారా రోహిత్ , శ్రీవిష్ణు ల కాంబినేషన్ లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంతో తన ప్రతిభ ని నిరూపించుకున్నాడు సాగర్ చంద్ర . తాజాగా వైష్ణవ్ తేజ్ – సాగర్ చంద్ర ల కాంబినేషన్ లో మొదలైన ఈ సినిమా చడీచప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకుంటోంది . ఇప్పటికే మెగా కుటుంబం నుండి హీరోలు , నటులు చాలామందే అయ్యారు వాళ్ళ సరసన ఈ వైష్ణవ్ తేజ్ చేరనున్నాడు .

- Advertisement -

English Title: sai dharam tej brother vaishnav tej debut with director sagar chandra

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All