
`ప్రతీరోజు పండగే` చిత్రంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో `సోలో బ్రతుకే సోబెటర్` చిత్రంతో పాటు దేవా కట్టా చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు అండర్ ప్రొడక్షన్‌లో వుండగానే హీరో సాయిధరమ్‌తేజ్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని శుక్రవారం స్వయంగా సాయి ధరమ్‌తేజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ చిత్రాన్నిశ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్ెన్ ప్రసాద్, దర్శకుడు సుకుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు.
ఈ సినిమాతో సాయి ధరమ్‌తేజ్ కొత్త జొనర్‌ని టచ్ చేయబోతున్నారు. థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మవీ తెరపైకి రాబోతోంది. ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ని షేర్ చేసిన సాయిధరమ్‌తేజ్ ఈ సినిమాతో కొత్త జోనర్‌ని ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. ఆ పోస్టర్‌లో `సిద్ధార్థ నామ సంవత్సరే..బృహస్పతిః సింహరాశౌ స్థితి నమయే, అంతిమ పుష్కరే` అని సంస్కృతంలోని వాక్యంతో పాటు షట్‌చక్రంలో భయంకరంగా ఓ కన్ను కనిపిస్తోంది.
మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం ద్వారా సుకుమార్ వద్ద స్క్రిప్ట్ రచన విభాగంలో పనిచేసిన కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ స్క్రిన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్, ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాల్ని చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనున్నారట.