
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం `ఆచార్య`. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్ సిద్ధాగా నటిస్తున్న ఈ చిత్రంలో అతనికి జోడీగా పూజా హెగ్డే కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.
అయితే గత కొన్ని రోజులుగా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న `ఆచార్య` షూటింగ్ ఆగిపోయిందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నటిస్తున్న సోను సూద్ కు పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచి ఈ పుకార్లు మరింత పెరిగాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని చిత్ర బృందం చెబుతోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోందని ఆగిపోలేదని తెలిసింది.
పవన్ కళ్యాణ్ కోవిడ్ కోసం పాజిటివ్ పరీక్షించడంతో చిరు, చరణ్ ఈ ఇద్దరూ షూటింగ్ ఆపేసి పవన్ ను చూసుకుంటున్నారని వార్తలు వినిపించడం మొదలైంది. `ఆచార్య` షూటింగ్ చేస్తూనే చేశారు. చిరు, చరణ్ ఇద్దరూ పవన్ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారని తెలిసింది.