Homeటాప్ స్టోరీస్సినీ కార్మికుల‌కు ఉచితంగా టీకా: చిరంజీవి

సినీ కార్మికుల‌కు ఉచితంగా టీకా: చిరంజీవి

సినీ కార్మికుల‌కు ఉచితంగా టీకా: చిరంజీవి
సినీ కార్మికుల‌కు ఉచితంగా టీకా: చిరంజీవి

కింగ్ నాగార్జున న‌టించిన హైవోల్టేజ్ యాక్ష్ థ్రిల్ల‌ర్ `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. దియా మీర్జా, స‌యామీఖేర్‌, అలీరెజా, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవ‌లే ఈ మూవీ విడుద‌లైంది. ప్రేక్ష‌కుల నుంచి మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఇదిలా వుంటే ఈ సినిమాని, సినిమా టీమ్ పై మెగాస్టార్ చిరంజీవి తాజాగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

ప్ర‌తీ ఒక్క‌రూ ఈ చిత్రాన్ని త‌ప్ప‌కుండా చూడాల‌న్నారు. ముందు జ‌రిగిన క‌థ నేప‌థ్యంలో రియ‌లిస్టిక్ పంథాలో ఈ మూవీని తీస్తున్నార‌ని తెలిసి చాలా ఫ్లాట్‌గా సినిమా వుంటుంద‌నుకున్నాన‌ని, అయితే సినిమా ఆద్యంతం ఉత్కంఠ భ‌రితంగా సాగింద‌ని, ఇంత మంచి చిత్రాన్ని అందించిన నా స్నేహిఉతు నాగార్జున‌ని అభినందిస్తున్నాన‌ని., అలాగే ఇలాంటి క‌థ‌ని తెర‌పైకి తీసుకొచ్చిన ద‌ర్శ‌కుడు అహిషోర్ సాల్మ‌న్‌కు హ్యాట్సాఫ్ అని తెలిపారు.

- Advertisement -

సినీ కార్మికుల గురించి మాట్లాడుతూ కోరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ కార్మికుల‌కు ఉచితంగా టీకా ఇప్పించేందుకు ప‌ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, ఇందుకు సంబంధించిన ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. గ‌తేడాది క‌రోనా వైర‌స్ సృష్టించిన క్లిష్ట‌ప‌రిస్థితుల్లో క‌రోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఎంతో మంది సినీ కార్మికుల‌కు సాయం చేశాం. అందులో కొంత మొత్తం మిగిలింది. దాని ద్వారా ఎంతో మంది సినీ కార్మికుల‌కు, వారి కుటుంబ స‌భ్యుల‌కు వ్యాక్సిన్ ఇప్పించాల‌నే ఆలోచ‌న‌లో వున్నాం`  అన్నారు మెగాస్టార్‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All