Homeటాప్ స్టోరీస్కోడి లో కరోనా ఉందని నిరూపిస్తే కోటి రూపాయల బహుమతి

కోడి లో కరోనా ఉందని నిరూపిస్తే కోటి రూపాయల బహుమతి

కోడి లో కరోనా ఉందని నిరూపిస్తే కోటి రూపాయల బహుమతి
కోడి లో కరోనా ఉందని నిరూపిస్తే కోటి రూపాయల బహుమతి

కరోనా వైరస్ వల్ల పౌల్ట్రీ రంగానికి ఇప్పటికీ దాదాపు 500 నుండి 800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఒక అంచనా. దీనికితోడు సోషల్ మీడియా వేదికల సాక్షిగా ఏ వార్త వచ్చినా… అనేక రకాలైన పుకార్లు వ్యాపింపజేసే ఒక బ్యాచ్ చికెన్ లో, మటన్ లో కరోనా వైరస్ ఉందని భారీగా ప్రచారాలు చేశారు. చైనా లో ఉన్న ఊహాన్ సిటీలో మాంసం మార్కెట్ ద్వారా వైరస్ వ్యాపించిందని శాస్త్రవేత్తలు చెప్పడంతో, దీనిపై ప్రజలు కూడా సానుకూలంగా రియాక్ట్ అయ్యి చికెన్ మటన్ తినడం తగ్గించేశారు. వేసవికాలం రాబోతున్న ఈ సమయంలో కిలో 200 రూపాయల వరకు పలకాల్సిన చికెన్ ధర ప్రస్తుతం 30 రూపాయల నుండి 20 రూపాయలకు పడిపోయింది. అదే విధంగా దాదాపు ఐదు రూపాయలకు చేరువలో ఉండే కోడిగుడ్డు ధర ఇప్పుడు రూపాయి కి పడిపోయింది.

ఇక సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సైతం చికెన్ మరియు ఎగ్ మేళా నిర్వహించి చికెన్ మరియు గుడ్లు తింటే కరోనా వైరస్ రాదు.! అని ప్రచారం చేసినా కూడా ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. దరిమిలా వారు ఆ ప్రచారం నిర్వహించిన రెండో లేదా మూడో రోజున తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో మాంసాహారం తినే అలవాటున్న ప్రజలు అదేవిధంగా శాఖాహారం తింటూనే మాంసాహారం కూడా తినే అలవాటున్న ప్రజలు అందరూ అన్ని రకాల మాంసాహారం తినడం తగ్గించి వేశారు.

- Advertisement -

ఇక కొంతమంది సామాజిక కార్యకర్తలు అయితే చికెన్ మరియు కోడిగుడ్లు తింటే కరోనా వైరస్ రాదు; అని ప్రభుత్వ అధికారికంగా ప్రచారం నిర్వహిస్తోంది. కానీ ఇతర పంటలైన పసుపు,పొగాకు,టమేటా మరియు ఇతర ఎగుమతులు, వాణిజ్య పంటలకు అదే విధమైన ధీమా ఎందుకు కల్పించడం లేదు.? అని ప్రశ్నిస్తున్నారు.

ఇక దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా పౌల్ట్రీ రంగానికి సంబంధించిన పెద్దలు ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. కోడి గుడ్లు మరియు చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదనీ,ఇప్పుడు ప్రజల్లో ఉన్నఅపనమ్మకాన్ని పోగొట్టాలని…. ఎవరైనా చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుంది..! అని శాస్త్ర పూర్వకంగా నిరూపించిన వారికి కోటి రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

కాని దీనికి కూడా ప్రజల వైపు నుంచి స్పందన శూన్యం. ఎందుకంటే కరోనా వైరస్ ఒక్కసారి గనుక వచ్చింది.. అంటే, దానికి ఎటువంటి ఔషధము,చికిత్స,నివారణ లేదు. మరణమే శరణ్యం. ఒకవేళ వ్యాధి వచ్చిన వ్యక్తి రోగ నిరోధక శక్తి అద్భుతంగా పనిచేసి అతను కోలుకుంటే అది కేవలం అతని అదృష్టం..! అనే నిజం తెలిసిన ప్రజలు అసలు ప్రాణాల విషయంలో రిస్క్ తీసుకునే పరిస్థితిలో లేరు. ఏదిఏమైనా కరోనా వైరస్ వల్ల ఒక్క పౌల్ట్రీ రంగానికి కాదు; దేశ వ్యాప్తంగా ఉన్న అనేక రంగాలకు సంబంధించి వందల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All