Homeగాసిప్స్ఆర్ ఆర్ ఆర్ లో పాటల ప్రవాహమే!

ఆర్ ఆర్ ఆర్ లో పాటల ప్రవాహమే!

ఆర్ ఆర్ ఆర్ లో పాటల ప్రవాహమే!
ఆర్ ఆర్ ఆర్ లో పాటల ప్రవాహమే!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ దాదాపు సగం పూర్తయిందట. అప్పట్లో ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ ప్రకారం సాగట్లేదని, అందువల్ల రిలీజ్ డేట్ వాయిదా పడటం ఖాయమని వార్తలు వచ్చాయి. కానీ ఇటీవలే రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ అనుమానాలను పటాపంచలు చేసాడు. షూటింగ్ షెడ్యూల్ ప్రకారమే సాగుతోందని, వాయిదా వేసే ప్రసక్తే లేదని ఘంటాపథంగా తెలియజేసాడు. రాజమౌళి షూటింగ్ మొదలు కాకముందే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. ఈ చిత్రం జూలై 30న విడుదలవుతుందని చెప్పుకొచ్చాడు. అయితే రాజమౌళి చెప్పినా, రామ్ చరణ్ చెప్పినా ఈ చిత్ర రిలీజ్ డేట్ పై ఇంకా అందరికీ అనుమానాలు ఉన్నాయి. రాజమౌళి సినిమాలంటే కచ్చితంగా లేట్ అవుతాయి అన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడిపోయింది.

ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్వతంత్ర సమరయోధులుగా నటిస్తున్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నారు. స్వతంత్ర పోరాటానికి ముందు ఇద్దరూ కలిసి ఎలా ముందుకు వెళ్లారు, ఎలా వారిలో స్వతంత్ర కాంక్ష రగిలింది అన్నది ఫిక్షనల్ గా చూపించబోతున్నాడు రాజమౌళి. మాములుగా హీరోలని ఒక రేంజ్ లో చూపించే రాజమౌళి ఇక పోరాట వీరులను ఏ రేంజ్ లో చూపిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇది పక్కన పెడితే ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ ఆర్ ఆర్ ఆర్ లో పాటలు ఎక్కువగా ఉంటాయట. మొత్తంగా ఏడూ లేదా ఎనిమిది పాటలు ఉంటాయని తెలుస్తోంది. స్వతంత్ర పోరాట సమయంలో పాట్రియాటిక్ సాంగ్స్, రామ్ చరణ్, తన పెయిర్, ఎన్టీఆర్, తన పెయిర్ మధ్య రొమాంటిక్ సాంగ్స్.. ఇలా సందర్భానికి తగినట్లుగా ఏడుకు పైనే పాటలు ఉంటాయంటున్నారు. సుద్దాల అశోక్ తేజ ఒక్కరే ఆర్ ఆర్ ఆర్ కోసం మూడు పాటలు అందించినట్లు తెలిపారు. మరి పాటలు బాగా తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఏడుకు పైన పాటలు పెట్టడం అంటే గొప్ప విషయమే. ఇదివరకు తెలుగు సినిమాలంటే కచ్చితంగా 6 పాటలుండేవి. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. అవసరమైతేనే పాటలు పెడుతున్నారు. దాంతో సినిమాల్లో పాటల సంఖ్యా ఐదు లేదా నాలుగుకు చేరుకుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏడు పాటలంటే జనాల ఆమోదం ఎలా ఉంటుందోనన్న సందేహాలు ఉన్నాయి.

- Advertisement -

రాజమౌళికి ఆస్థాన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇద్దరు టాప్ స్టార్స్ ఎలా చూపిస్తాడోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. మరి జక్కన్న ఏం చేస్తాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All