Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళికి రోజుకొక సమస్య!

ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళికి రోజుకొక సమస్య!

ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళికి రోజుకొక సమస్య!
ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళికి రోజుకొక సమస్య!

దర్శక ధీరుడు రాజమౌళికి తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ ఏ స్టార్ హీరోని తీసుకున్నా వారికి తీసిపోని క్రేజ్ రాజమౌళి సొంతం. రాజమౌళి బ్రాండ్ మీదే హిట్ అయిన సినిమాలు తన కెరీర్ లో ఉన్నాయి. ఇప్పటివరకూ అపజయం అన్నది ఎరుగని రాజమౌళి బాహుబలితో నేషన్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు నార్త్ లో ఎక్కడ అడిగినా రాజమౌళి అంటే తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బాహుబలితో ఊహకు అందని స్కేల్ లో సినిమాను తీసి విజయవంతమైన రాజమౌళి తన తర్వాతి చిత్రంగా నందమూరి తారక రామారావు జూనియర్, కొణిదెల రామ్ చరణ్ లు లీడ్ గా ఆర్ ఆర్ ఆర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.

ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్న సంగతి తెల్సిందే. విప్లవ నాయకుల కథకు ఫిక్షన్ ను జోడించి ఆర్ ఆర్ ఆర్ ను తీస్తున్నాడు రాజమౌళి. సాధారణంగా తన సినిమాలు చెప్పిన డేట్ కు విడుదల కావు.  బాహుబలి అయితే సంవత్సరానికి పైగా వాయిదా పడింది. అయితే ఆర్ ఆర్ ఆర్ విషయంలో రాజమౌళి పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు. షెడ్యూల్ కరెక్ట్ గా వేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కు కావాల్సినంత టైం కేటాయించుకుని రాజమౌళి జులై 30 2020న రాబోతున్నట్లు వెల్లడించాడు.

- Advertisement -

ఎప్పుడూ లేనిది రిలీజ్ డేట్ విషయంలో కాన్ఫిడెన్స్ ప్రదర్శించాడు. అయితే ఎంత పక్కాగా అనుకున్నా ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు సంవత్సరానికి పైగా వాయిదా పడుతోంది. ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ కు వరసగా గాయాలవ్వడం వల్ల ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో గ్యాప్ వచ్చింది. నెలన్నరకు పైగా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు అంతా సెట్ అయి షూటింగ్ ఏకధాటిగా  జరగాలి అనుకుంటే ఇప్పుడు సమస్య బాలీవుడ్ సైడ్ నుండి వస్తోంది.

బాహుబలిని పాన్ ఇండియా సినిమాగా మలిచినా ఎక్కడా బాలీవుడ్ వాళ్ళను తీసుకోలేదు. కానీ ఈసారి బాలీవుడ్ నటులను సైతం ఎంపిక చేసుకున్నాడు. అలియా భట్, అజయ్ దేవగన్ ను ఈ చిత్రంలో కొన్ని కీలక పాత్రల కోసం ఎంపిక చేసుకున్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళు రాజమౌళికి చుక్కలు చూపిస్తున్నారట. అజయ్ దేవగన్ ముందు తన హిందీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుని ఆర్ ఆర్ ఆర్ కు డేట్లు లేవని చెబుతున్నాడట. షూటింగ్ మధ్యలో ఉండడంతో రాజమౌళి కూడా లాక్ అయిపోయాడు. తన డేట్లు కావాలంటే జనవరి వరకూ ఆగాల్సిందేనని అజయ్ దేవగన్ చెప్పేసాడు.

అలియా భట్ కూడా అంతే. ఇచ్చిన డేట్లను మీరు ఉపయోగించుకోలేదు కాబట్టి నాకు నచ్చినప్పుడు డేట్లు ఇస్తా అంటోందిట. సౌత్ ఇండియన్ నటులైతే రాజమౌళి ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు కేటాయిస్తారు కానీ బాలీవుడ్ వాళ్ళు బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రం చేసినా కూడా రాజమౌళిని ఇంకా రీజినల్ దర్శకుడిగా, ఆర్ ఆర్ ఆర్ ను ఒక రీజినల్ సినిమాగానే చూస్తున్నారు. దీంతో ఎప్పుడూ లేనిది రాజమౌళి ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All