Homeన్యూస్నాటు నాటు సాంగ్ వెనక ఎంత కష్టం..!

నాటు నాటు సాంగ్ వెనక ఎంత కష్టం..!

RRR Natu Natu Song Backstory
 

ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి వచ్చిన నాటు నాటు సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి వేసిన నాటు డ్యాన్స్ అభిమానులని ఉర్రూతలూగించింది. ఆడియెన్స్ పల్స్ బాగా తెలిసిన రాజమౌళి ఎవరిని ఎలా చూపించాలో బాగా తెలుసు. ఇక నాటు నాటు సాంగ్ లో ఆ స్టెప్పుకి దాదాపు 15 నుండి 18 టేకులు తీసుకున్నట్టు తెలుస్తుంది.

చరణ్ తో కలిసి తను సింక్ లో వేయడానికి 15 నుండి 18 టేకులు దాకా తీసుకున్నారట. రాజమౌళి ఇద్దరిది కరెక్ట్ సింక్ కుదిరే వరకు వేయించారని చెప్పాడు తారక్. జస్ట్ శాంపిల్ కే ఆడియెన్స్ ఖుషి అయ్యారు. ఇక అసలు వెండితెర మీద ఆ సాంగ్ కు థియేటర్ దద్దరిల్లిపోతుందని చెప్పుకుంటున్నారు.

- Advertisement -

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా.. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ ఇద్దరి పాత్రలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All