Homeగాసిప్స్ఆర్ ఆర్ ఆర్ కు ఇక్కడి నుండే 200 కోట్లు

ఆర్ ఆర్ ఆర్ కు ఇక్కడి నుండే 200 కోట్లు

ఆర్ ఆర్ ఆర్ కు ఇక్కడి నుండే 200 కోట్లు
ఆర్ ఆర్ ఆర్ కు ఇక్కడి నుండే 200 కోట్లు

రాజమౌళి బ్రాండ్ జనాల్లో ఏ స్థాయిలో ఉందనే దానికి పెర్ఫెక్ట్ ఉదాహరణ ఈ ఆర్టికల్. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 200 కోట్లకు బిజినెస్ జరిగేలా ప్రయత్నిస్తున్నారట. బయ్యర్లు కూడా రేటు ఎంతంటే అంత వెనకాడకుండా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు కాస్ట్ ఎంతనేది పరిగణలోనే లేదని వినికిడి. కేవలం ఈ సినిమా హక్కులు ఎంత చెబితే అంతకు చేజిక్కించుకోవడానికి బయ్యర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమాకు 200 కోట్ల బిజినెస్ జరిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలుస్తోంది.

తెలుగు సినిమాల వరకూ అది ఎంత బడా సినిమా అయినా కూడా 100 కోట్ల మార్క్ కు చేరుకోవడం చాలా కష్టం. ఇప్పటిదాకా బాహుబలి 1 అండ్ 2, రంగస్థలం, సైరా, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు మాత్రమే ఈ క్లబ్ లో చోటు సంపాదించాయి. బాహుబలి 1 దాదాపు 110 కోట్ల షేర్ వసూలు చేయగా, బాహుబలి 2 అయితే 193 కోట్లకు కొంచెం అటూ ఇటూగా కలెక్ట్ చేసి ఆగిపోయింది. తెలుగు సినిమాల వరకూ ఇదే హయ్యస్ట్. అంటే ఇప్పటివరకూ 200 కోట్ల సినిమానే లేదు. అలాంటిది ఆర్ ఆర్ ఆర్ కు మాత్రం బిజినెస్ 200 కోట్లు అంటే అది ఇంకెంత సాధించాలో ఊహించుకోవచ్చు. ఇదంతా రాజమౌళి వల్లే అని వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలుగా ఇద్దరు టాప్ స్టార్స్ ఉన్నా కానీ రాజమౌళి అనే బ్రాండ్ లేకపోతే 200 కోట్ల మార్క్ అనేది సాధ్యం కాకపోయి ఉండవచ్చు.

- Advertisement -

ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బడ్జెట్ దాదాపు 400 కోట్లు. ఏకంగా 10 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. విడుదలకు ముందే నిర్మాత డబల్ ప్రాఫిట్స్ తో సినిమాను అమ్మాలని చూస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ విషయం ఇప్పుడే ఇలా ఉంటే విడుదలకు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All