
స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రమోషనల్ సాంగ్ షూట్ జరుగుతోంది. దీని తర్వాత లాస్ట్ సాంగ్ షూటింగ్ యూరోప్ లో ఉంటుంది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ షురూ అయ్యాయి. మేకింగ్ వీడియోకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్ర రైటర్ విజయేంద్ర ప్రసాద్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. “ఆర్ ఆర్ ఆర్ ఒక పాట్రియాటిక్ సినిమా. ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంటుంది. రాజమౌళి ఎక్కడా కాంట్రవర్సీ అన్నది లేకుండా తెరకెక్కించాడు. ఈ సినిమా వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినవు” అని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్.
ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నాడు.