Homeటాప్ స్టోరీస్తుదిశ్వాస విడిచిన ప్రముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్

తుదిశ్వాస విడిచిన ప్రముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్

తుదిశ్వాస విడిచిన ప్రముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్
తుదిశ్వాస విడిచిన ప్రముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ అధినేత ఆర్ ఆర్ వెంకట్ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఏఐజీ హాస్పిటల్ లో జాయిన్ అయిన ఆయన చనిపోయారు. సినిమాలను నిర్మించడంతో పాటు పలు చిత్రాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేసారు. రవితేజతో కిక్, డాన్ శీను, మిరపకాయ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అలాగే మహేష్ బాబుతో తీసిన బిజినెస్ మ్యాన్ కూడా సూపర్ హిట్ అయింది.

సామాన్యుడు చిత్రంతో మొదలైన ఆయన నిర్మాణ ప్రయాణం ఆంధ్రావాలా, విక్టరీ, మాయాజాలం, గుండమ్మ గారి మనవడు, కిక్, బహుమతి, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్ మ్యాన్, పూల రంగడు, లవ్లీ, ఢమరుకం, ఆటోనగర్ సూర్య, పైసా వంటి చిత్రాలను నిర్మించారు. హిందీలో ఏక్ హసీనా తీ, జేమ్స్ చిత్రాలను నిర్మించారు. ఇంగ్లీష్ లో ఆయన నిర్మించిన డివోర్స్ ఇన్విటేషన్ తెలుగులోని ఆహ్వానం చిత్రానికి రీమేక్. 2013 తర్వాత నుండి ఆయన సినిమా నిర్మాణాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

- Advertisement -

ఆర్ ఆర్ వెంకట్ మృతి పట్ల పలు సెలబ్రిటీలు తమ సంతాపాన్ని తెలియజేసారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All