Homeటాప్ స్టోరీస్డ్ర‌గ్స్ కేస్ : రియా అక్టోబ‌ర్ 6 వ‌ర‌కు జైల్లోనే!

డ్ర‌గ్స్ కేస్ : రియా అక్టోబ‌ర్ 6 వ‌ర‌కు జైల్లోనే!

డ్ర‌గ్స్ కేస్ : రియా అక్టోబ‌ర్ 6 వ‌ర‌కు జైల్లోనే!
డ్ర‌గ్స్ కేస్ : రియా అక్టోబ‌ర్ 6 వ‌ర‌కు జైల్లోనే!

సుశాంత్ సింగ్ మృతి కేసు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ని త‌ల‌పిస్తోంది. సుశాంత్ మృతికి బాలీవుడ్‌లో వున్న డ్ర‌గ్స్ దందాకు ద‌గ్గ‌రి సంబంధం వుంద‌ని తేల‌డంతో ఎన్‌సీబీ అధికారులు సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్ ని అదుపులోకి తీసుకోవ‌డంతో ఈ కేసు ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతోంది. రియాకు డ్ర‌గ్ పెడ్ల‌ర్‌ల‌కు సంబంధం వుంద‌ని తేల‌డంతో ఈ కేసుని ఆ కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు శామ్యూల్ మిరండా, దీపేష్‌ల‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నా కొద్ద ప‌లు సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌టికి వ‌స్తున్నాయి. దీంతో వీరి రిమాండ్‌ని మ‌రో 14 రోజుల పాటు పొడిగించిన‌ట్టు తెలిసింది. దీంతో ముంబైలోని బైకుల్లా జైలులో రియా అండ్ కో బ్యాచ్ అక్టోబ‌ర్ 6 వ‌ర‌కు వుండ‌నుంది.

- Advertisement -

పోలీసుల విచార‌ణ‌లో రియా డ్ర‌గ్స్ పెడ్ల‌ర్‌ల నుంచి కొనడ‌మే కాకుండా అమ్మిన‌ట్టుగా కూడా పోలీసులు ఆధారాలు సేక‌రించారు.  దీంతో రియా అండ్ కో కు సెష‌న్స్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ని విధించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All