
రియా అండ్ కో చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలని బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఇది ఆత్మ హత్య? లేక హత్యా .. లేక ప్రేరేపిత హత్య అనే అనుమానం దేశ వ్యాప్తంగా మొదలైంది. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందా అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఈ నేపథ్యంలో రియా ఆమె కుటుంబం చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో మొదటి నుంచి రియానే ముద్దాయిగా అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీంతో సీబీఐ ఆ కోణంలో విచారణ చేపట్టింది. అనంతరం సుశాంత్ సింగ్ ఫాదర్ కె.కె. సింగ్ తన కొడుకు అకౌంట్‌లో వున్న 15 కోట్ల రూపాయల్ని రియా అనధికారికంఆ తన అకౌంట్‌కు తరలించిందని కేసు పెట్టడంతో ఆడీ రంగంలోకి దిగింది. ఆ తరువాత రియాకు బాలీవుడ్‌లో మోరు మోసిన డ్రగ్ పెడ్లర్‌లకు నేరుగా సంబంధాలున్నాయని తేలడంతో నార్కోటిక్స్ డ్రగ్స్ కరంట్రోల్ బోర్ట్ విచారణ మొదలుపెట్టింది.
తాజా పరిణామాల నేపథ్యంలో రియా, ఆమె సోదరుడు షోవిక్ అకౌంట్‌లని , వారి ఖర్చులని పరిశీలించిన ఈడీ మొత్తం రియా అండ్ రియా ఫ్యామిలీకి సుశాంత్ మృతికి సంబంధం వుందని ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ కుటుంబంపై సీరియస్‌గా యాక్షన్ తీసుకోవడానికి ఈడీ సిద్ధమవుతున్నట్టు తాజా సమాచారం. ఈడీ పట్టు బిగిస్తే ఆ కోణంలో సీబీఐ, నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బోర్డ్ కూడా రియా ఆమె సోదరుడు షోవిక్‌పై యాక్షన్ తీసుకునే అవకాశాలే అత్యధికంగా కనిపిస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం.