Homeటాప్ స్టోరీస్జైలు ఖైదీల కోసం రియా యోగా సెషన్ నిర్వహించిందా?

జైలు ఖైదీల కోసం రియా యోగా సెషన్ నిర్వహించిందా?

జైలు ఖైదీల కోసం రియా యోగా సెషన్ నిర్వహించిందా?
జైలు ఖైదీల కోసం రియా యోగా సెషన్ నిర్వహించిందా?

రియా చక్రవర్తికి డ్రగ్స్ కేసులో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అనుమానాస్ప‌దంగా అరెస్టు అయిన ఆమెకు దాదాపు ఒక నెల తర్వాత బెయిల్ ల‌భించింది. దీంతో గ‌త కొన్ని రోజులుగా మాన‌సిక ఒత్తిడికి గుర‌వుతున్న ఆమెకు జైలు నుండి బయటకు వెళ్ళడంతో గొప్ప ఉపశమనం లభించింది.

జైలులో ఈ నెల రోజుల పాటు రియా సాధార‌ణ మ‌హిళ‌గానే వ్య‌వ‌హ‌రించింద‌ని, ఇంటి ఫుడ్ కూడా ఆమెకు ల‌భించ‌లేద‌ని, అయినా త‌న‌ని తాను బాగానే నిగ్ర‌హించుకుంద‌ని ఆమె లాయ‌ర్ వెల్ల‌డించారు. ఒక ఆర్మీ యువ‌తిగా త‌న చుట్టూ జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌పై ధైర్యంగా పోరాడింద‌ని చెప్పుకొచ్చాడు. ఇదే క్ర‌మంలో రియా జైలులో ఖైదీల‌కు యోగా పాఠాలు నేర్పింద‌ని, రియా పోరాటం చేయ‌డానికి సిద్ధంగా వుంద‌ని, అది ఎవ‌రితో అయినా ఆమె పోరాడ‌గ‌ల‌ద‌ని స్ప‌ష్టం చేశాడు. ఇక‌నైనా రియాని వెంటాడే వేట ఆగాల‌న్నారు.

- Advertisement -

రియాకు ముంబై హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ని మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. పాస్ పోర్ట్‌ని కోర్టుని హ్యాండోవ‌ర్ చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. ముంబై విడిచి ఎట్టిప‌రిస్థితుల్లోనూ బ‌య‌టికి వెళ్ల‌రాద‌ని పేర్కొంది. రానున్న ప‌ది రోజులు స్థానికి పోలీస్టేష‌న్‌లో ప్ర‌తీ రోజు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ల‌క్ష పూజీక‌త్తుమీద రియాకు బెయిల్ మంజూరైంది. ఆమె సోద‌రుడు షొవిక్‌కి మాత్రం ఎలాంటి బెయిల్ ల‌భించ‌లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All