Homeటాప్ స్టోరీస్రామ్ గోపాల్ వ‌ర్మ గోవాకు చెక్కేస్తున్నారా?

రామ్ గోపాల్ వ‌ర్మ గోవాకు చెక్కేస్తున్నారా?

రామ్ గోపాల్ వ‌ర్మ గోవాకు చెక్కేస్తున్నారా?
రామ్ గోపాల్ వ‌ర్మ గోవాకు చెక్కేస్తున్నారా?

రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌జెంట్ టైమ్‌లో వ‌రుస సినిమాల‌తో అత్యంత బిజీగా వున్న డైరెక్ట‌ర్‌. వివాదాస్ప‌ద అంశాల నేప‌థ్య‌లో వివాదాస్ప‌ద చిత్రాల్ని తెర‌కెక్కిస్తూ క‌రోనా టైమ్‌లో క‌ల‌క‌లం సృష్టిస్తున్నారు. క్లైమాక్స్‌, నేక్డ్‌, ప‌వ‌ర్‌స్టార్‌ వంటి చిత్రాల‌ని ఇప్ప‌టికే రిలీజ్ చేసి సంచ‌ల‌నం సృష్టించిన వ‌ర్మ ప్ర‌స్తుతం మ‌రో మూడు చిత్రాల్ని వ‌న్ బై వ‌న్ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. మిర్యాల‌గూడా ప‌రువు హ‌త్య నేప‌థ్యంలో `మ‌ర్డ‌ర్‌` చిత్రాన్ని ప్లాన్ చేసిన వ‌ర్మ అప్స‌ర‌రాణి స్కిన్ షో నేప‌థ్యంలో `థ్రిల్ల‌ర్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ మూవీని ఓటీటీలో ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత `డేంజ‌ర‌స్‌` చిత్రాన్ని లెస్బియ‌న్‌ల నేప‌థ్యంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్లా‌న్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అత్య‌ధిక శాతం అవుట్‌డోర్ లొకేష‌న్‌ల‌లో చేయాల్సి వుంద‌ట‌. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్ లో షూటింగ్ చేసే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఇక్క‌డ షూటింగ్ చేయ‌డం అంతా శ్రేయ‌స్క‌రం కాద‌ని భావించిన వ‌ర్మ గోవాకు ప‌య‌నం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

అక్క‌డే మ‌రో మూడు చిత్రాల్ని పూర్తి చేయాల‌ని వ‌ర్మ ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే త‌న‌కు కు గ‌త రెండు రోజులుగా హై ఫీవ‌ర్ వ‌స్తోంద‌ని వ‌ర్మ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. క‌రోనా ల‌క్షణాలు లేవ‌ని వ‌ర్మ స్ప‌ష్టం చేశారు. అయితే వ‌ర్మ లాయ‌ర్ మాత్రం వ‌ర్మ‌కు క‌రోనా వైర‌స్ సోకింద‌ని, ఆ కార‌ణంగానే తాము విచార‌ణ‌కు హాజ‌రు కాలేక‌పోతున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `మ‌ర్డ‌ర్‌` సినిమా విష‌యంలో వ‌ర్మ‌పై అమృత కోర్టుని ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All