Homeటాప్ స్టోరీస్రేవంత్ రెడ్డిని ఓడించడం కేసీఆర్ వల్ల అవుతుందా ?

రేవంత్ రెడ్డిని ఓడించడం కేసీఆర్ వల్ల అవుతుందా ?

Revanth reddy giving sleepless nights to kcrరేవంత్ రెడ్డి కేసీఆర్ కంట్లో నలుసులా తయారయ్యాడు , ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అప్పటినుండి కేసీఆర్ పై విమర్శల జడివాన కురిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి . దాంతో అతడిపై ఫోకస్ పెట్టడంతో ఓటుకి నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యాడు , జైలుకి కూడా వెళ్ళొచ్చాడు . ఇక జైలుకి వెళ్లొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇంకా కేసీఆర్ పై , తెలంగాణ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నాడు , బుసలు కొడుతున్నాడు కానీ ఎక్కడా తగ్గడం లేదు . జైలుకి వెళ్ళొచ్చాడు కదా మానసికంగా క్రుంగి పోయి ఉంటాడు తగ్గి ఉంటాడులే అనుకుంటే తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి నిద్ర లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి . దాంతో అతడ్ని ఎలాగైనా సరే కొడంగల్ లో ఓడించాలని పట్టుదలగా ఉన్నాడు కేసీఆర్ అలాగే కేటీఆర్ కూడా .

రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ని వీడి కేసీఆర్ తో పోరాడాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీలో చేరాడు . కొడంగల్ లో రేవంత్ రెడ్డి బలమైన నాయకుడు దాంతో అతడ్ని ఓడించడానికి రాజకీయంగా పెద్ద దెబ్బ కొట్టడానికి భారీ ఎత్తున తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్ అండ్ కో . అయితే రేవంత్ ని ఓడించడం కేసీఆర్ వల్ల అవుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది . రేవంత్ రెడ్డి బలమైన నాయకుడు కావడంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జతకలిసింది దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత రేవంత్ కు కలిసొచ్చే అంశం కాగా కేసీఆర్ కు మాత్రం రేవంత్ ని ఓడించాలని రాజకీయంగా సమాధి చేయాలనీ తహతహగా ఉంది . కానీ అది కుదిరేలా కనిపించడం లేదు .

- Advertisement -

English Title: Revanth reddy giving sleepless nights to kcr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All