Homeటాప్ స్టోరీస్కేసీఆర్ ని చెడుగుడు ఆడుకున్న రేవంత్

కేసీఆర్ ని చెడుగుడు ఆడుకున్న రేవంత్

Revanth Reddy fires on KCR తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని చెడుగుడు ఆడుకున్నాడు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి . ఈరోజు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొడంగల్ లో ప్రచారానికి వచ్చిన దరిమిల రాహుల్ ముందు చెలరేగిపోయాడు . రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటే ప్రజల్లోంచి బ్రహ్మాండమైన స్పందన రావడంతో మరింత జోష్ పెంచాడు . రేవంత్ విమర్శలకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన రావడంతో రాహుల్ గాంధీ సైతం షాక్ అయ్యాడు . రేవంత్ రెడ్డి ఒక్కో మాటని తూటాలా పేల్చుతుంటే సభలో ఒకటే ఈలలు , గోలలు దాంతో రేవంత్ లో మరింత ఉత్సాహం వచ్చింది .

ఇక కేసిఆర్ నైతే తీవ్ర స్థాయిలో విమర్శించాడు రేవంత్ , పొద్దస్తమానం మందు తాగెటోన్ని ఫామ్ హౌజ్ కే పరిమితం చేయాలనీ ప్రజలకు పిలుపునిచ్చాడు రేవంత్ రెడ్డి . అంతేకాదు ఎంతసేపు వంద ….. వంద అని అంటున్నాడు వాడి బొంద ……. కేసీఆర్ కు 30 సీట్లు వస్తే గొప్ప . తెలంగాణాలో అధికారం కాంగ్రెస్ పార్టీదే అంటూ కాంగ్రెస్ కార్యకర్తల్లో హుషారు పెంచాడు . రేవంత్ రెడ్డి వాగ్ధాటి ఎలాంటిదో స్వయంగా చూసిన రాహుల్ అందుకే హెలికాఫ్టర్ ఇచ్చి తెలంగాణ అంతటా తిరగమని ప్రోత్సహించాడు .

- Advertisement -

English Title: Revanth Reddy fires on KCR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All