Homeటాప్ స్టోరీస్రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

Revanth Reddy Arrested in Kodangalకొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ని ఈరోజు తెల్లవారు ఝామున అరెస్ట్ చేసారు పోలీసులు . కొడంగల్ లో తన ఇంట్లో ఉన్న రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేయడంతో రేవంత్ అనుచరులు , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అయితే రేవంత్ అనుచరులను , ముఖ్య కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో కొడంగల్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసి జడ్చర్ల ట్రైనింగ్ సెంటర్ కు తరలించడంతో రేవంత్ భార్య గీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది . ఇంట్లో ఉన్న మనిషి ని అరెస్ట్ చేయడం ఏంటి ? అరెస్ట్ చేయడానికి ఇంటి తలుపులు విరగ్గొట్టడం ఏంటి ? అంటూ నిప్పులు చెరిగింది .

ఈరోజు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడంగల్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చాడు దాంతో ఈసీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ని ముందస్తు అరెస్ట్ చేసారు . రేవంత్ అరెస్ట్ తో కాంగ్రెస్ , టీడీపీ నాయకులు , కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు .

- Advertisement -

English Title: Revanth Reddy Arrested in Kodangal

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All