Homeగాసిప్స్చిరు - కొరటాల శివ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయిందా?

చిరు – కొరటాల శివ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయిందా?

చిరు - కొరటాల శివ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
చిరు – కొరటాల శివ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయిందా?

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సైరా నరసింహారెడ్డితో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా అందించిన ఫలితం చిరుకి కచ్చితంగా మిశ్రమానుభూతిని పంచే ఉంటుంది. ఎందుకంటే సైరా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ను రాబట్టగలిగింది కానీ మిగతా భాషల్లో ఘోరంగా విఫలమైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ధరలకు అమ్ముడుపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు మిగిలింది తక్కువే. ఇక ఇప్పుడు చిరంజీవి సైరాను వదిలి తన తర్వాత సినిమాపై దృష్టి కేంద్రీకరించాడు. కొరటాల శివతో చిరంజీవి నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు తుదిదశకు చేరుకున్నాయి.

కొరటాల శివ నేతృత్వంలోని టీమ్ షూటింగ్ షెడ్యూల్స్, కాస్ట్ అండ్ క్రూను ఎంపిక చేయడం వంటి విషయాల్లో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే త్రిషను కథానాయికగా ఎన్నుకున్నట్లు వార్తలు వచ్చాయి. కొరటాల శివ గత చిత్రాల్లాగే ఈ సినిమాలో కూడా సామాజికాంశాలపై చర్చ ఉంటుందన్న న్యూస్ బలంగా ఉంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో దేవాదాయ శాఖలో జరిగే అక్రమాలపై చర్చ ఉంటుంది అన్నట్లుగా తెలుస్తోంది. జనవరి నుండి ఈ సినిమా చిత్రీకరణ మొదలుకాబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

కొరటాల శివ చేసిన 4 సినిమాలు సూపర్ హిట్లు కావడంతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి వంటి స్టార్ తో కొరటాల శివ ఎటువంటి సినిమా అందిస్తాడోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ చిత్రంలో చిరంజీవి డబల్ రోల్ అన్న వార్తలు వచ్చినా తర్వాత అవి ఒట్టి పుకార్లేనని తేలిపోయింది. ఈ చిత్రానికి సంబంధించిన మరో న్యూస్ తాజాగా చక్కర్లు కొడుతోంది. అదే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి. జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్న నేపథ్యంలో ఆగష్టు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం బెస్ట్ అని చిత్ర టీమ్ భావిస్తున్నారట. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ మొదలైన రోజునే అప్డేట్ చేస్తూ రిలీజ్ డేట్ గురించి కూడా ప్రకటన చేసే అవకాశముంది.

ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడిగా ఎంపికైన విషయం తెల్సిందే. కొరటాల గత సినిమాలకు దేవి సంగీత దర్శకుడు కాగా ఈ చిత్రానికి మణిశర్మను ఎందుకు తీసుకున్నారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All