Homeటాప్ స్టోరీస్చిరు కోస‌మే ఆ పాట చేసింద‌ట‌!

చిరు కోస‌మే ఆ పాట చేసింద‌ట‌!

Regina open up her item son with chiru
Regina open up her item son with chiru

స్టార్ హీరోల చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్ కామ‌న్ అయిపోతున్నాయి. క్రేజ్ కోసం, మాస్‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డం కోసం ద‌ర్శ‌కులు హాట్ ఐట‌మ్ సాంగ్ లేకుండా సినిమాని పూర్తి చేయ‌డం లేదు. తాజాగా కొర‌టాల శివ కూడా న‌తు రూపొందిస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్‌ని ప్లాన్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల రూపొందిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. రిలీజ్‌కు ముందు నుంచే ప్ర‌త్యేక ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ య‌మ స్పీడుగా సాగుతోంది.

ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేసిన చిత్ర బృందం త్వ‌ర‌లో హీరో, హీరోయిన్‌ల‌కు సంబంధించిన సీన్స్‌ని షూట్ చేయ‌బోతోంది. ఈ చిత్రంలో చిరుకు జోడీగా త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో రెజీనా కాసాండ్ర ఓ ప్ర‌త్యేక గీతంలో త‌ళుక్కున మెరిసింది. అయితే ఈ పాట‌లో న‌టించ‌డానికి బ‌ల‌మైన కార‌ణాన్ని రెజీనా వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది.

- Advertisement -

చిరు సినిమా కాబ‌ట్టే ప్ర‌త్యేక గీతం చేశాన‌ని, భ‌విష్య‌త్తులో ప్ర‌త్యేక గీతాల్లో తాను న‌టించ‌న‌ని, తేల్చి చెప్పేసింది. మెగాస్టార్‌తో క‌లిసి స్టెప్స్ జ‌త‌క‌ల‌ప‌డం అంత ఈజీ కాద‌ని, అయితే త‌న డ్యాన్స్‌ని మెగాస్టార్ ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించ‌డం మ‌ర్చిపోలేన‌ని చెప్పుకొచ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All