Homeటాప్ స్టోరీస్చరిత్ర సృష్టిస్తున్న చరణ్ టీజర్

చరిత్ర సృష్టిస్తున్న చరణ్ టీజర్

Record views for Ramcharan's Vinaya Vidheya Rama Teaserరాంచరణ్ నటించిన వినయ విధేయ రామ టీజర్ ఈరోజు ఉదయం విడుదల చేసిన విషయం తెలిసిందే . ఆ టీజర్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం రికార్డుల మోత మోగుతోంది . చరణ్ కు మెగా అభిమానుల అండ పుష్కలంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే . మెగాస్టార్ వారసుడు మెగా పవర్ స్టార్ కావడంతో ఇంకేముంది టీజర్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది . దానికి తోడూ మాస్ కి పుష్కలంగా నచ్చే అంశాలు ఈ టీజర్ లో ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు . చాలా సంతోషంగా ఉన్నారు మెగాభిమానులు. అసలే టీజర్ కోసం , ఫస్ట్ లుక్ కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు అలాంటిది వాళ్ళకు నచ్చేలా టీజర్ ఉంటే వదిలి పెడతారా కుమ్మేయరు ! ఇప్పుడు అదే జరుగుతోంది సోషల్ మీడియాలో .

తమ అభిమాన హీరోని ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలా చూపించేసరికి దర్శకులు బోయపాటి శ్రీను ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు . టీజర్ ఏమో ఊర మాస్ కానీ టైటిల్ ఏమో చాలా సాఫ్ట్ వినయ విధేయ రామ అని . చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు . ఇక డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . ఇక ఈ చిత్రాన్ని 2019 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title: Record views for Ramcharan’s Vinaya Vidheya Rama Teaser

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All