Homeటాప్ స్టోరీస్చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం

చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం

Rebal actor Ambareesh passes awayకన్నడ రెబల్ స్టార్ అంబరీష్ గుండెపోటు తో కన్నుమూశాడు . 66 సంవత్సరాల అంబరీష్ గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు . ఇప్పటికే పలుమార్లు ఆసుపత్రుల్లో చేరిన అంబరీష్ తాజాగా నిన్న రాత్రి 10 :45 నిమిషాలకు గుండెపోటు తో బెంగుళూర్ లోని ఓ ఆసుపత్రిలో మరణించాడు . అంబరీష్ ని బ్రతికించడానికి డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించారు , బ్రతికించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి . దాంతో కన్నడ చిత్ర రంగంలో తీవ్ర విషాదం నెలకొంది . కన్నడంలో 230 సినిమాలలో నటించిన అంబరీష్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే .

తెలుగమ్మాయి , హీరోయిన్ సుమలత ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంబరీష్ . సుమలత – అంబరీష్ లకు ఒక కొడుకు పేరు అభిషేక్ . సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రాణించాడు అంబరీష్ . కాంగ్రెస్ పార్టీలో చేరి పార్లమెంట్ కు అలాగే అసెంబ్లీ కి ప్రాతినిధ్యం వహించాడు . అలాగే కేంద్ర మంత్రిగా , రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం అంబరీష్ ది . అంబరీష్ మరణ వార్త తెలియగానే కర్ణాటకలో విషాద ఛాయలు నెలకొన్నాయి . అంబరీష్ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .

- Advertisement -

English Title: Rebal actor Ambareesh passes away

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All